Home తాజా వార్తలు వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులు అరెస్టు

వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులు అరెస్టు

ARREST
కరీంనగర్: జిల్లా కేంద్రంలోని సాయి రామకృష్ణ లాడ్జిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. వ్యభిచారం చేస్తున్న ఇద్దరు విటులు, ఇద్దరు యువతులతో పాటు లాడ్జి మేనేజర్‌ను అరెస్టు చేశారు. నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు కరీంనగర్ ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యభిచారంపై పూర్తి నిఘా ఉందని, ఎప్పటికైనా దీనిని నిర్వహించే వారు మానుకోవాలని, లేకుంటే చట్ట ప్రకారం తీవ్ర పరిణామాలు ఎదర్కోవాల్సి వస్తుందని టాస్క్‌ఫోర్స్ సిఐ శ్రీనివాస్ రావు హెచ్చిరించారు.