Home వార్తలు చిన్న సినిమాలకు ఐదవ షో ఇస్తాం: తలసాని

చిన్న సినిమాలకు ఐదవ షో ఇస్తాం: తలసాని

talasaniమహంతి పీకె దర్శకత్వంలో విషురెడ్డి, వర్ధన్‌రెడ్డి, ఐరా ప్రధాన పాత్రధారులుగా కొండ్రెడ్డి సతీష్ చౌరి నిర్మించిన చిత్రం ‘వాడు వీడు ఓ..కల్పన’. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపి మంత్రి మాణిక్యాలరావు, సినీ నటులు సుమన్, అల్లరి నరేష్ తదితరులు హాజరయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాణిక్యాలరావు ఆడియో సీడీలను ఆవిష్కరించి సుమన్, అల్లరి నరేష్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ “టాలీవుడ్‌లో చిన్న చిత్రాలు మరిన్ని రావాలి. హైదరాబాద్ కేంద్రంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధిచెందే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తోంది. త్వరలోనే ఆన్‌లైన్ టికెట్ విధానం ప్రవేశపెడతాం. చిన్న సినిమాలకు ఐదవ షో ఇచ్చే ఏర్పాటుచేస్తాం. ‘వాడు వీడు ఓ..కల్పన’ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. సతీష్‌లాంటి యువకులు సినిమాలు తీయాలి.”అని అన్నారు. సుమన్ మాట్లాడుతూ “ఈ సినిమా మ్యూజిక్, ఫొటోగ్రఫీ బాగున్నాయి. చిన్న సినిమాలకు ప్రభుత్వం సహాయం అందజేస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి”అని తెలిపారు. చిత్ర దర్శకుడు పి.కె.మహంతి మాట్లాడుతూ “ఈ సినిమా టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది. యూత్‌ను ఎంటర్‌టైన్ చేసే విభిన్న కథా చిత్రమిది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ప్రసన్నకుమార్, గిరిబాబు, కాకర్ల కృష్ణ, పద్మిని తదితరులు పాల్గొన్నారు.