Home జాతీయ వార్తలు 50కిలోల హెరాయిన్ సీజ్

50కిలోల హెరాయిన్ సీజ్

50 Kg Heroin Seized at Jammu Kashmir

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో 50కిలోల హెరాయిన్‌ను శుక్రవారం నార్కోటిక్స్ అధికారులు సీజ్ చేశారు. కుప్వారా జిల్లా నుంచి ట్రక్కులో ఈ హెరాయిన్‌ను ఢిల్లీకి తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి పట్టుకున్నారు. యాపిల్ క్రేట్ల కింద హెరాయిన్ పొట్లాలను పెట్టినట్టు గుర్తించారు. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ హెరాయిన్ విలువ సుమారు రూ.250 కోట్లు ఉంటుందని నార్కోటిక్స్ అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జమ్మూకశ్మీర్‌లో రూ.800 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై తమకు సమాచారం ఇవ్వాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

50 Kg Heroin Seized at Jammu Kashmir