Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఇస్రో సైంటిస్టుకు 50లక్షల పరిహారం

50 Lakh Compensation for ISRO Scientist

ఢిల్లీ : ఇస్రో గూఢచర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కేరళ సైంటిస్టు ఎస్.నంబీ నారాయణన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గూఢచర్యం పేరుతో వేధింపలకు గురైన నారాయణన్‌కు 50లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నారాయణన్ అన్యాయంగా అరెస్టు చేసి వేధించారని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ కేసును పరిష్కరించేందుకు డికె జైన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. తనను అధికారులు అక్రమంగా ట్రాప్ చేశారని, తనను వేధించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తనకు నష్టపరిహారం చెల్లించాలని నారాయణన్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో నారాయణన్‌ను వేధించిన అధికారులే నష్టపరిహారాన్ని చెల్లించాలని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. 1994,నవంబర్ 30వ తేదీన కేరళ పోలీసులు దేశ ద్రోహం కేసులో నారాయణన్‌ను అరెస్టు చేశారు. నారాయణన్‌పై అక్రమంగా కేసు నమోదు చేశారని సిబిఐ ఇచ్చిన నివేదికను సుప్రీంకోర్టు అంగీకరించింది.

50 Lakh Compensation for ISRO Scientist

Comments

comments