Home జాతీయ వార్తలు జాయ్ ఆచూకీ తెలిపితే 50 వేల నగదు బహుమతి

జాయ్ ఆచూకీ తెలిపితే 50 వేల నగదు బహుమతి

TIGERSనాగ్‌పూర్ : నాగ్‌పూర్‌లోని ఉమ్‌రెడ్ – కర్హండ్లా అభయారణ్యం నుచి తప్పించుకుపోయిన పులి జాయ్ ఆచూకీ తెలిపిన వారికి యాబై వేల నగదు బహుమతిని అందిస్తామని కన్జర్వేషన్ లెన్సెస్ అండ్ వైల్డ్‌లైఫ్ అనే స్వచ్ఛంద ప్రకటించింది. పులి ఆచూకీ, అడుగుజాడలు, సంచరిస్తున్న ప్రదేశం ఏదైన ఒక సమాచారం ఇచ్చినా బహుమతి అందజేస్తామని తెలిపింది. గతంలో ఈ పులి నాగ్‌జీరా రిజర్వ్ నుంచి ఉమ్‌రెడ్ -కర్హండ్లా అభయారణ్యానికి వలస వచ్చింది. దీని సమాచారం తెలుసుకునేందుకు ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు , అటవీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.