Home కుమ్రం భీం ఆసిఫాబాద్ ముఖం తినేసిన ఎలుగుబంటి..!

ముఖం తినేసిన ఎలుగుబంటి..!

Bear-attak

మన తెలంగాణ/బెజ్జూర్: కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని రేచిని గ్రామానికి చెందిన మోర్లె గణపతి అనే వ్యక్తిపై ఆదివారం ఉదయం ఎలుగుబంటి దాడిచేయడంతో తీగ్రవంగా గాయపడ్డట్టు గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… మోర్లె గణపతి ఉదయం కుశ్నపల్లి బీట్ పరిధిలో మేకల కోసం మేతను కోస్తున్న సమయంలో చెట్లపొదల నుండి వచ్చిన ఎలుగుబంటి ఆకస్మాత్తుగా అతనిపై దాడి చేసిందని దీంతో అతని కన్ను, చెవి వద్ద తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే ఫారెస్టు అధికారులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి ఫారెస్టు సెక్షన్ అధికారి శ్రావన్‌కుమార్, బేస్‌క్యాంపు సిబ్బంది చేరుకుని గాయపడ్డ గణపతిని కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. బాధితుడి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుందని ఎఫ్‌ఆర్‌ఒ రాంమోహన్ తెలిపారు.