Home కరీంనగర్ ‘సస్పెన్షన్’ బ్రిడ్జి కల నెరవేరింది..

‘సస్పెన్షన్’ బ్రిడ్జి కల నెరవేరింది..

brdg

*దేశంలోనే నంబర్ 1..ఉయ్యాల వంతెన
*500 మీటర్ల పొడవుతో సస్పెన్షన్ బ్రిడ్జి
*బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గుతుంది
*2019 జనవరిలో పనులు పూర్తి
*సుందర నగరంగా కరీం‘నగరం’
*శంకుస్థాపనకు మంత్రులు
*తుమ్మల,కెటిఆర్,ఈటెల
*కరీంనగర్ ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్

కరీంనగర్ మానకొండూర్ పాత రహదారిలో మానేర్‌పై సుందరమైన వంతెనను (సస్పెన్షన్ బ్రిడ్జి )హైటెక్నాలజీతో నిర్మించేందుకు ప్రభుత్వం రూ.147కోట్లు నిధులు కే టాయించిన సంగతి విదితమే. బుధవారం బ్రి డ్జి నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించేందుకు టాటా కన్షల్టెన్సీ రాగా స్థానిక ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ పనులు చేపట్టే ప్రదేశాన్ని చూపించా రు. కరీంనగర్‌లో ఉయ్యాల బ్రిడ్జి నిర్మాణం జరిగితే నగరం రూపురేఖలే మారనున్నాయి. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికి సిఎం కెసిఆర్ వందలాది కోట్లను విడుదల చేశా రు. నగరంలో సుందరీకరణ పనులు కూడా కొన సాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణం పనులు కూ డా ప్రారంభం అవుతుండడంతో కరీంనగర్ ప్రజల కల నెరవేరనుంది. అందులో భాగంగానే బ్రిడ్జి ని ర్మాణ పనులకు స్థలాన్ని పరిశీలించారు.

కరీంనగర్‌టౌన్: కరీం‘నగరం’ను సుందరంగా తీర్చిదిద్దేందుకు సిఎం కెసిఆర్ ఎంతో శ్రద్ధతో ఉన్నారని, ఇందులోని భాగంగా కరీంనగర్ మానకొండూర్ పాత రహదారిలో మానేర్ పై సుందరమైన ఉయ్యాల వంతెనను హైటెక్నాలజీతో నిర్మిస్తున్నామని కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్ అన్నారు. బ్రిడ్జ్ ని ర్మాణం చేసే టాటా కన్షల్టెన్సీ ప్రతినిధులతో కలిసి హౌసింగ్ బోర్డులోని స్మశాన వాటిక ప్రదేశంలో స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ బ్రిడ్జ్ నిర్మాణంతో కరీంనగర్‌కు దేశంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. నిర్మాణ పనుల కో సం 20వ తేదీ నుంచి వారి ఆధీనంలోకి అప్పగించడం జరుగుతుందని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ ఏ పని తీసుకున్నా కరీంనగర్ ను ంచి చేపడుతున్నారని అందులో భాగంగానే దేశంలో కరీంనగర్‌ను సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. సౌ త్ ఇండియాలోనే ప్రప్రథమ సస్పెన్షన్ వంతెన నిర్మాణానికి 147 కోట్ల పనికి టెండర్లు పిలిచి పూర్తయ్యాయన్నారు. జనవరి మొదటి లేదా రెండవ వారంలో పనులు ప్రారంభిస్తామని, క్యాస్టింగ్ కోసం మెటీరియల్ నిల్వ చేసుకునేందుకుగాను గురువారం నుంచి ప్రభు త్వం స్థలం కూడా అప్పగిస్తుందన్నారు.
ఇక్కడి నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకుగాను ఇద్దరు సైట్ మేనేజర్లను నియమించిందన్నారు. వీరిద్దరు కూడా ఇక్కడే ఉండి ప నులు చేపడుతారన్నారు. హైటెక్నాలజీతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తామన్నారు.2019 జనవరి తర్వాత వంతెన పనులు పూర్తయి వినియోగంలోకి వస్తాయన్నారు. వంతెన నిర్మాణంతో అల్గునూర్ వంతెనపై ట్రాఫిక్ తగ్గుతుందన్నారు.నగరంలోని కాపువాడ జంక్షన్‌లో పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని, మం త్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, కెటిఆర్, ఈటెల రాజేందర్‌లు శం కుస్థాపనకు రానున్నట్లు తెలిపారు. ఈ వంతెన నిర్మాణానికి టాటా కన్సల్టెన్సీ ముందుకువచ్చి ప్రిస్టేజిగా తీసుకుని లాస్‌వస్తున్నా కూడా పనులు చేసేందుకు మందుకు వచ్చామని వారు తెలుపడం జరిగిందన్నారు. టాటా కన్షల్టెన్సీకి ఏ అవసరం ఉన్నకూడా అన్ని ప్రభుత్వ పరంగా సమకూరుస్తామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కోటి రూపాయలు కూడా దక్కించుకొని కరీంనగర్‌కు తెలంగాణ వచ్చిన తర్వాత వందలాది కోట్లను మంజూరు చేయించుకున్నామన్నారు. ఈ పనుల్లో భాగంగా కమాన్ నుంచి సదాశివపల్లి మానేర్ వరకు నాలుగులైన్ల రహదారిని నిర్మించనున్నామని ఇందుకు గాను 34 కోట్లు వెచ్చించనున్నామని తెలిపారు.
రహదారి పనుల నిర్మాణ పనులు ఇక్కడి వారు టెండర్ దక్కించుకోగా, 500 మీటర్ల సస్పెన్షన్ బ్రిడ్జిని మాత్రం టాటా కన్సల్టెన్సీకి దక్కిందన్నారు. ఇప్పటికే 20సార్లు సమావేశాలు నిర్వహించి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. భూమి నుంచి 35 మీటర్ల ఫౌండేషన్ తోపాటు 14మీటర్లపై భాగాన పిల్లర్ ఉండగా దానిపైన కేబుల్ కో సం ఏర్పాటు చేస్తారన్నారు. రెండు పిల్లర్లతో ఈ నిర్మాణం 45 మీటర్లతో 500మీటర్ల కేబుల్ వంతెనుంటుందన్నారు. జర్మని, టర్కీ కంపెనీతో జాయింట్ వెంచర్‌తో ఏడాదిలోనే పూర్తి చేసే విధంగా మూడు షిప్టుల్లో నిర్మిస్తారన్నారు.
వంతెన నిర్మాణం అనంతరం మహారాష్ట్ర నుంచి కాకుండా ఇతర ప్రాంతాల వారు వరంగల్ వెళ్ళేందుకు మార్గం సుగమం కావడమేకాక ఆరు కిలో మీటర్లు దూరం తగ్గుతుందన్నారు. 2019 లో బ్రిడ్జ్ పనులు పూర్తి అవుతాయని తెలిపారు. 2018 కరీంనగర్ ఒక సుం దర నగరంగా మారనున్నదన్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా నగరం లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. నగర ప్రజల సహకారంతోనే స్మార్ట్ సిటీ లుక్‌లు తీసుకోస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్లు సునీల్‌రావు, టాటా కన్సల్టెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
అభ్వివృద్ధిని అడ్డుకుంటే
ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు…
ఆర్ట్ కళాశాలలో పార్క్ నిర్మించి తీరుతాం..
నాడు త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో రావణాసురుడికి రా ముడికి జరిగిన యుద్ధంలో మరణించినవారు అటు స్వర్గానికి వెల్లలేక ఇటు నరకానికి వెళ్లలేక ఇక్కట్లలో పడ్డట్లుగానే ఆనాటి రాక్షసులుగా నేడు అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు వివిధ రూపాల్లో పుట్టుకొచ్చారని కరీంనగర్ ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ అన్నారు. ఆర్ట్ కళాశాలలో తాము అనుకున్న పార్క్ పనులను ఖచ్చితంగా ని ర్మించి చూపిస్తామని తెలిపారు.అడ్డుకుంటామన్న వారంతా ఆనాటి రాక్షసులేనన్నారు. అడ్డుకుంటామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించా రు. షాపింగ్ మాల్స్ కట్టుకోవడానికి తాను, ఎంపి నిర్ణయించుకు ంటే ప్రభుత్వం అడ్డుకోబోదన్నారు. తమకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే సంకల్పమే తప్ప ఇంకోటిలేదన్నారు. ప్రతి ఎన్నికల్లో కూడా 5 శాతం ప్రజలు తమకు వ్యతిరేకంగా ఉంటున్నారని, ఆకోవలోకే వీరు వస్తారన్నారు. 95శాతం మంది ప్రజల ఆదరాభిమానా లు తమకు అండగా ఉన్నాయన్నారు. ఎవరు అడ్డు వచ్చినా వారిని తొలగించుకుంటూ ముందుకెళ్తామే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు.