Home తాజా వార్తలు టిఆర్‌ఎస్ పార్టీలో భారీగా చేరికలు..

టిఆర్‌ఎస్ పార్టీలో భారీగా చేరికలు..

500 people joined the TRS party in Rangareddy
కేశంపేటః మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, షాద్‌నగర్ ఎంఎల్ఏ అంజయ్య యాదవ్ సమక్షంలో కేశంపేట మాజీ ఎంపిపి సజ్జల విశ్వనాథంతో పాటు 300 మందికి పైగా కార్యకర్తలు గులాభి తీర్థం పుచ్చుకున్నారు. అదే విధంగా బోదునంపల్లి మాజీ సర్పంచ్, గ్రామ ఉప సర్పంచ్‌లతో పాటు 200 మంది వరకు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కాకునూరు గ్రామం నుండి టిడిపి సీనియర్ నాయకులు యాదయ్య గౌడ్‌తో పాటు కార్యకర్తలు పార్టీలో చేరారు. సుందరాపూరం, సంతాపూర్‌తో పాటు ఆయా గ్రామాలకు చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ అంజయ్య యాదవ్ మాట్లాడుతూ మాజీ ఎంపిపి విశ్వనాథం టిఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో పార్టీ పుంజుకుందని అన్నారు.