Home తాజా వార్తలు పాక్ జైళ్లలోని 546 మంది భారత ఖైదీలకు విముక్తి

పాక్ జైళ్లలోని 546 మంది భారత ఖైదీలకు విముక్తి

Pakistan-Jails

న్యూఢిల్లీ: గత కొన్ని సంవత్సరాలుగా దాయాది పాక్ కారగారాల్లో శిక్ష అనుభవిస్తున్న సుమారు 546 మంది భారతీయ ఖైదీలు త్వరలోనే విడుదల కానున్నారు. ఈ మేరకు శనివారం పాక్ ప్రభుత్వం విడుదల చేయనున్న ఖైదీల జాబితాను విడుదల చేసింది. 2008లో ఇరు దేశాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం తమ దేశంలో శిక్ష అనుభవిస్తున్న వీరిని విడుదల చేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. విడుదల కానున్న 546 మందిలో 494 మంది మత్సకారులు ఉండగా, మిగతా వారు సామాన్య పౌరులు. ప్రతి ఏడాది జనవరి1, జూలై1న రెండు దఫాలుగా పరస్పరం ఖైదీలను వారి దేశాలకు పంపివేసేస్తున్నట్లు పాక్ వెల్లడించింది.