Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పోస్టల్‌ శాఖలో 55వేల ఖాళీల భర్తీ

Indian-Postal-Departmentహైదరాబాద్: దేశవ్యాప్తంగా పోస్టల్ విభాగంలో మొత్తం 55వేల గ్రామీణ డాక్‌సేవక్ పోస్టులను నవంబర్‌లో భర్తీ చేయనున్నట్టు భారత పోస్టల్ విభాగం సెక్రెటరీ బివి సుధాకర్ తెలిపారు. పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు తొలిసారిగా ఆన్‌లైన్ విధానాన్ని తీసుకువస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, నవంబర్‌లో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా, గ్రామీణ డాక్‌సేవక్ పోస్టుల్లో బ్రాంచ్ పోస్టుమాస్టర్‌కి ఎస్‌ఎస్‌సి, డెలిరి సిబ్బందికి ఎనిమిదవ తరగతి విద్యార్హతగా ఉంటుందని చెప్పారు. అభ్యర్థుల ఎస్‌ఎస్‌సి మెమో, కులధ్రువీకరణ, తదితర ధ్రువీకరణ పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే, వాటిని పరిశీలించిన తర్వాత అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.

Comments

comments