Home కెరీర్ నీలోఫర్‌కు 569 పోస్టులు మంజూరు

నీలోఫర్‌కు 569 పోస్టులు మంజూరు

Niloufer-Hospital

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని నీలోఫర్ ఆస్పత్రికి 569 పోస్టులు మంజూరు చేసింది. 500 పడకల ఐసియు బ్లాక్ నిర్మాణానికి అనుమతి నేపథ్యంలో ప్రభుత్వం అదనపు పోస్టులు మంజూరు చేసింది. ఈ పోస్టుల్లో 281 స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు పశుసంవర్ధక శాఖలో 52 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని టిఎస్‌పిఎస్‌సి ద్వారా భర్తీ చేయనుంది.