Home జాతీయ వార్తలు వచ్చే నెలలో అందుబాటులోకి అదనంగా 52,224 బెర్త్‌లు

వచ్చే నెలలో అందుబాటులోకి అదనంగా 52,224 బెర్త్‌లు

trainమన తెలంగాణ/ హైదరాబాద్ : వేసవిలో పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని పలు రద్దీ మార్గాల్లో తిరిగే రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు. జూన్‌లో రద్దీ మార్గాల్లో తిరిగే డైలీ, బై వీక్లీ, వీక్లి ,స్పెషల్ తదితర రైళ్లకు వీటిని జత చేయడం ద్వారా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న 52,224 మందికి రిజర్వేషన్ సౌకర్యం పొందే అవకాశముంది. 38 రైళ్లలో జూన్ 1 నుంచి 30 వరకు తాత్కాలిక ప్రాతిపదికన అదనంగా ఫస్ట్ ఎసి, ఎసి టూ టైర్, ఎసి త్రీ టైర్, స్లీపర్ క్లాస్, ఎసి ఛైర్ కార్ బోగీల ను జత చేయను న్నారు. దీంతో అదనంగా 1,560 ఫస్ట్ ఎసి బెర్తులు, 11,040 ఎసి టూ టైర్ బెర్తులు, 15,360 ఎసి త్రీ టైర్ బెర్తు లు, 11,664 స్లీపర్ క్లాస్ బెర్తులు , 12,600 ఎసి ఛైర్‌కార్ బెర్తులు అందుబాటులోకి రాను న్నాయి. అదనపు కోచ్ లను జత చేసే రైళ్లలో సికింద్రాబాద్ – విజయవాడ శాతవాహన, గుంటూరు – వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ – రాజ్‌కోట్ ట్రైవీక్లి, రాజ్‌కోట్ – సికింద్రాబాద్ ట్రైవీక్లి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ షిర్డీ ఎక్స్‌ప్రెస్, షిర్డీ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, తిరుపతి – సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ – తిరుపతి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ – నర్సాపూర్, నర్సాపూర్ – హైదరాబాద్, హైదరాబాద్ – త్రివేండ్రం, త్రివేం డ్రం- హైదరాబాద్ శబరిఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్- మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లున్నాయి.