Home అంతర్జాతీయ వార్తలు పాక్‌లో 59 మంది భారత జాలర్లు అరెస్ట్

పాక్‌లో 59 మంది భారత జాలర్లు అరెస్ట్

59-Indian-fishermen-arresteఇస్లామాబాద్: పాక్‌లో 59 మంది భారతీయ మత్స్యకారులు అరెస్ట్ అయ్యారు. పాక్ ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించి చేపలు పడుతున్న వీరిని, నావిక భద్రత సిబ్బంది గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో అత్యధికులు గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. మార్చి 17న దేశంలోని వివిధ జైళ్లలో ఉన్న 9 మంది పాకిస్తాన్ మత్స్యకారులను భారత్ విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే పాక్ 59 మంది భారత జాలర్లను అరెస్ట్ చేయడం గమనించదగిన విషయం.