Home ఛాంపియన్స్ ట్రోఫీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు

RCB-Vs-DD

బెంగళూరు: ఐపిఎల్ 10 సీజన్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య జరుగుతున్న ఐదో మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన బెంగళూరు సారథి వాట్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక బెంగళూరు జట్టులో నాల్గు మార్పులు చోటుచేసుకున్నాయి.

హేడ్, అంకిత్ చవాన్,సచిన్ బేబీ, అరవింద్‌లను తొలగించి బిల్లీ స్టాన్‌లేక్, విష్ణు వినోద్, పవన్ నెగీ, అబ్దుల్హా లకు చోటు కల్పించారు. బెంగళూరు మొదటి మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఢిల్లీకి మాత్రం ఈ సీజన్‌లో ఇదే తొలి మ్యాచ్.