Home జాతీయ వార్తలు తమిళనాడులో మరో దారుణం…!

తమిళనాడులో మరో దారుణం…!

Gang Rape on Young Women in Bhadradri

చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో 11 ఏళ్ల బధిర బాలికపై దాదాపు 22 మంది ఏడు నెలలపాటు అత్యాచారం చేసిన ఘటన మరవక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. టెంపుల్ టౌన్ తిరువణ్ణమలై సందర్శనకు వచ్చిన 21 ఏళ్ల రష్యా యువతిపై ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధిత యువతి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, యువతిని పరిశీలించిన వైద్యులు అత్యాచారానికి గురైందని పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన తిరువణ్ణమలై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. యువతి బస చేసిన సర్వీస్ అపార్టుమెంటులో పోలీసులు డ్రగ్స్ ను కనుగొన్నారు. మరోవైపు రష్యా యువతి తన సర్వీసు అపార్టుమెంటుకు రమ్మని ఆహ్వానిస్తేనే వెళ్లి ఆమె అంగీకారంతోనే శృంగారంలో లో పాల్గొన్నామని ఓ నిందితుడు చెప్పడం గమనార్హం.