Home జాతీయ వార్తలు రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో 6గురు మృతి

రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో 6గురు మృతి

Car Accident

లక్నో: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మథుర జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యమునా ఎక్స్‌ప్రెస్‌వే పై కారు అదుపు తప్పి ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించామని స్థానిక ఎస్‌పి ఆదిత్య కుమార్ శుక్లా పేర్కొన్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతులు ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమ బుద్ధా నగర్ జిల్లాలోని జేవార్ చెందిన వారుగా గుర్తించారు. మృతులు నీరజ్(25), అనిత(30), విష్ణు(25), కరుణ(22), సురేష్(25), 13 ఏళ్ల బాలిక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

 

6 Members Killed As Car Accident On Yamuna Expressway