Home బిజినెస్ ఆరు నెలల గరిష్ఠానికి కీలక రంగాల వృద్ధి

ఆరు నెలల గరిష్ఠానికి కీలక రంగాల వృద్ధి

 సెప్టెంబర్‌లో 5.2 శాతం నమోదు

companies

న్యూఢిల్లీ: సెప్టెంబర్‌లో ఎనిమిది కీలక రంగాల వృద్ధి రేటు ఆరు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. బొగ్గు, సహజ వాయువు, విద్యుత్ రంగాల్లో వేగవంతమైన పనితీరుతో 5.2 శాతం వృద్ధి రేటు నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో కీలక రంగాల వృద్ధి రేటు శాతం శాతంగా ఉంది. బొ గ్గు, ముడి చమురు, సహజ వాయువు(నాచురల్ గ్యాస్), రిఫైనరీ ఉత్పత్తులు, ఫర్టిలైజర్స్, స్టీల్, సి మెంట్, విద్యుత్ వంటి ఎనిమిది కీలక రంగాల వృద్ధి రేటు గణాంకాలను మంగళవారం ప్రభు త్వం వెల్లడించింది. అంతకుముందు ఆగస్టు నెల లో మౌలికసదుపాయ రంగంలో 4.9 శాతం వృ ద్ధి రేటు ఉంది. 2016 సంవత్సరంతో పోలిస్తే 2017 సెప్టెంబర్‌లో బొగ్గు ఉత్పత్తి 10.6 శాతం పెరిగింది. 201718 సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ సమయంలో క్యూములేటివ్ ఇండెక్స్ 1.5 శాతం పెరిగింది. 2016 సంవత్సరంతో పోలిస్తే 2017 సెప్టెంబర్‌లో ముడి చమురు ఉత్పత్తి 0.1 శాతం పెరిగింది. గతేడాదితో పోలిస్తే 201718 ఏప్రిల్‌సెప్టెంబర్ కాలంలో క్యూములేటివ్ ఇండెక్స్ 0.2 శాతం క్షీణించింది. సహజ వాయువు ఉత్పత్తి 2017 సెప్టెంబర్‌లో 6.3 శాతం పెరిగింది.
ఐఐపి(పారిశ్రామిక ఉత్పత్తి సూచీ)లో ఈ కీలక రంగాల వెయిట్ 40.27 శాతంగా ఉంటుంది. దీంతో 201718 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలంలో క్యూములేటివ్ వృద్ధి 3.3 శాతంగా నమోదైంది. క్రూడ్ ఆయిల్ సాధారణ పెరుగుదల 0.1 శాతం నమోదైనప్పటికీ బొగ్గు 10.6 శాతం వృద్ధి నమోదు చేసింది.
ఇక నాచురల్ గ్యాస్ 6.3 శాతం, పెట్రోలియం రిఫైనరీ 8.1 శాతం, సిమెంట్ 5.37 శాతం, విద్యుత్ 5.2 శాతం నమోదు చేసింది. ఫర్టిలైజర్ ఉత్పత్తి 7.7 శాతం వృద్ధి రేటును, అదే సమయంలో స్టీల్ రంగం 3.7 శాతంతో సాధారణ పెరుగుదలను నమోదు చేసింది.