Home అంతర్జాతీయ వార్తలు ఉగ్రదాడిలో ఆరుగురు భద్రతాధికారులు మృతి

ఉగ్రదాడిలో ఆరుగురు భద్రతాధికారులు మృతి

6 Pakistani security personnel killed in rocket attacks in Balochistan

కరాచీ: బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఈ సారి ఏకంగా రాకెట్లతో బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఆరుగురు పాకిస్థానీ భద్రతాధికారులు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అవారన్ జిల్లా మస్కే ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలోని పర్వత ప్రాంతంలో ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.