Home మహబూబ్‌నగర్ మఖ్తల్‌లో మహా మాయ

మఖ్తల్‌లో మహా మాయ

600 acres of government lands

600 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాలు                                                                                                                  తెరవెనుక కథ నడిపించిన రెవెన్యూ, సబ్‌రిజిష్టర్ అధికారులు..!                                                                                      లక్షల్లో మామూళ్లు ముడుపులు                                                                                                                                కాపాడాల్సిన అధికారులే.. కంచే చేను మేస్తే.. ఏలా?                                                                                                      కర్నాటక వాసులకు విక్రయాలు                                                                                                                                మధ్య దళారులతో పైరవీలు
విధులపై పేమ లేదు.. కాసులపైనే ధ్యాస                                                                                                                      రోజు వారి వ్యాపారమే లక్షం

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : కంచె చేను మేసింది. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు సంబంధిత అధికారులు, మధ్య దళారులు కలిసి అప్పనంగా అందిన కాడికి దండుకుంటున్నారు. పైఅధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో కింది స్థాయి రెవెన్యూ అధికారులు తమ సొంత భూముల్లాగా ఇష్టం వచ్చిన వారికి ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ భూములు ( డి పట్టాలు) అప్పగిస్తున్నారు. శవాలపై బొగ్గులు వేరుకున్న చందంగా భవిష్యత్ తరాల కోసం రక్షించాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడి బేరసారాలు పెట్టి ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ భూములపై క్రయ విక్రయాలు జరుపుతూ దర్జగా రియల్ దం దాలోనూ చేతులు తడుపుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక వేల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాగా తాజాగా మక్తల్ మండలం లో వందలాది ప్రభుత్వ భూములు హాంఫట్ చేసిన సంఘటనలు బయటికొస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మఖ్తల్ మండలం జిల్లాకు సరిహద్దులో, కర్నాటక సరిహద్దుల మధ్య ఉంది. నియోజకవర్గంలో దాదాపు 5 వేలకు పైగా ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉంది. ఒక్క మఖ్తల్ మండలంలోనే దాదాపు 1600 ఎకరాలకు పైగా ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉంది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కొందరు రియల్ ఎస్టేట్ వ్యా పారులగా మారారు. జిల్లాకు సరిహద్దులో ఉండడం, జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతగా లేకపోవడంతో అధికారుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విధులకు హాజరైనా, హాజరు కాక పోయినా పట్టించుకునే వారే లేరు. ఇక్కడ కాసులపై ఉన్న శ్రద్ధ విధుల పట్ల ఉండదు. కింది స్థాయి సిబ్బంది నుంచి పై అధికారుల వరకు రోజు సాయంత్రంలోగా ఎంత మామూళ్లు వచ్చిందన్నదే లక్షంగా చేసుకునే విధులు నిర్వహిస్తున్నారు. ఒక వైపు పరిపాలన సౌలభ్యం కోసం, పాలనా వికేంద్రీకరణ జరిగితే మెరుగైన పాలన జరుగుతుందని ముఖ్యమ్రంతి కెసిఆర్ చిన్న జిల్లాలు ఏర్పాటు చేసినా అవినీతి మాత్రం ఆలాగే ఉంది. గతంలో కంటే ఇంకా అవినీతి ఎక్కువైందన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యం గా రెవెన్యూ శాఖలో ఉన్నంత అవినీతి ఎందులోనూ లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మఖ్తల్ మండలంలో ప్రభుత్వ భూములపై కన్నేసిన అధికారులు, మధ్య దళారులు, సబ్ రిజిష్టర్ అధికారులు కుమ్మక్కై అందిన కాడికి అందినంతగా దోచుకున్నారు. ప్రభుత్వంలోని లొసుగులను ఆసరా చేసుకొని వందల ఎకరాలను ఇతరులకు అప్పగించి కోట్లలో అక్రమంగా సం పాదించినట్లు మండలంలో తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం ఒక వైపు ప్రయత్నిస్తున్నప్పటికీ మఖ్తల్ మండలంలో మాత్రం అవినీతి పరమాధిగా పని చేస్తున్నారు. మండలంలోని మంథన్‌గోడు గ్రామంలోనే సుమారు 600 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమంగా ఇతరుల చేతికి వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. చట్టం ప్రకారం ప్రభుత్వ భూమిని భూమిలేని నిరుపేదలకు, ఎస్‌సి,ఎస్‌టిలకు కేటాయించాలి. లేదా ప్రజల సామాజిక అవసరాల కో సం కేటాయించాలి. ఇందుకు అసైన్డు కమిటీ తీర్మాణం తప్పని సరి. ఈ కమిటీలో స్థానిక ఎంఎల్‌ఎ, ఆర్‌డిఓ, ఎంఆర్‌ఓ, తప్పనిసరిగా ఉండాల్సిన అవస రం ఉంది. ఈ కమిటీ తీర్మాణం ప్రకారం కనిసీ 5 ఎకరాల లోపు కేటాయించే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ ప్రభుత్వ భూమి కేటాయించాలంటే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్‌డిఓలు, తప్పనిసరి, ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ భూమి ఇవ్వాలంటే అందుకు సచివాలయంలోని సిసిఎల్‌ఎ అనుమతులు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. కాని మఖ్తల్ మండల కార్యాలయం లో ఎలాంటి అసైన్డు కమిటీలు తీర్మాణం లేకుండానే వందల ఎకరాల భూము లు కేటాయించారు. ఇందుకు పరిహారంగా రెవెన్యూ శాఖ అధికారులకు ఎకరాకు సుమారు పది వేల నుంచి 20 వేల దాకా మామూళ్లు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఒక అధికారి ఏకంగా కోటి రూపాయాలకు పైగా అప్పనంగా వెనుకేసుకున్నట్లు సర్వత్రా ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూముల కేటాయింపుల్లో మద్య దళారులతో కుమ్మక్కైన రెవెన్యూ అధికారులు సబ్ రిజిష్టార్‌లు అందిన కాడికి దండుకున్నారు. ప్రభు త్వ భూములకు బై నెంబర్లు సృష్టించి రిజిష్టర్ చేయించుకుంటున్నారు. సబ్ రిజిష్టర్‌లు కూడా రిజిష్టర్‌కు వచ్చిన భూమిపై ఇది ప్రభుత్వ భూమా లేక ప్రైవేట్ భూమా అన్నది పరిశీలించాలి. ప్రభుత్వ భూమి అయితే రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఇక్కడ కాసులిస్తే కలెక్టర్ కార్యాలయాన్నైనా రిజిష్టర్ చేస్తారన్న ఆరోపిస్తున్నారు. బై నెంబర్లు సృష్టించి రిజిష్ర్టేషను చేయడం, ఆ తర్వాత బై నెం బర్లను తుడిచి వేసి తహసీల్దార్ కార్యాలయంలో ఆన్‌లైన్‌లో రియల్ సర్వేనెంబర్లతో ఎక్కించడంతో సొంత భూములుగా మారిపోతున్నాయి.దీంతో వీటిపై ఆర్‌ఓఆర్‌ల అధారంగా బ్యాంకు రుణాలు, ఇటీవల సిఎం ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకం నిధులు అప్పనంగా కాజేశారు. ఇక్కడి భూములకు డిమాండ్ ఉండడంతో కొందరు కర్నాటక వాసులకు సొంత భూముల్లాగా ఎకరా రూ. 8 లక్షల నుంచి 10 లక్షల వరకు విక్రయించుకున్నారు. దీంతో ప్రభుత్వభూములు హాంఫట్ అయ్యాయి. ఒకరికి తెలియకుండా మరొక పేర్లపై భూముల వివరాలు మార్చుతున్నారు. అనిత అనే మహిళ భూమిని కొనుగోలు చేసి డ్యాక్కమెంట్లతో సహా,తహసీల్దార్ కార్యాలయంలో తమ పేర్లపై మార్పుకొరు దరఖాస్తు చేసుకుంది. అయితే అప్పటికే తన కొనుగోలు చేసుకున్న భూమిని ఇతరులపై పేరుపై ఆర్‌ఒఆర్, పహాణీలు రావడంతో ఆమె అవాక్కై ంది.ఇలా అనేక మందికి ఇష్టారాజ్యంగా డాక్కుమెంట్లను మార్పులు చేస్తూ వివాదాలకు కారణాలు అవుతున్నారు. సర్వేనెంబర్లు, 1688 నెంబర్లో సర్వెనెంబర్లు 47/1,80అ,746,53,79,45,446,44,419,215. వంటి అనేక సర్వే నెంబర్లలో ఈ భూ దందా సాగింది.రెండు శాఖల అధికారలు కుమ్మక్కై ఈ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఇతరుల పేరిట డి పట్టాల పేరుపై ఇచ్చిన అధికారులు తిరిగి వాటి విక్రయాలపై కూడా డాక్యుమెంట్లు సృష్టించి అందిన కాడికి దోచుకున్నారన్నా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.