Home జాతీయ వార్తలు యాచకుడికి జాక్‌పాట్

యాచకుడికి జాక్‌పాట్

కేరళలో రూ.65లక్షల లాటరీ తగిలిన ఎపి బిచ్చగాడు

beggerతిరువనంతపురం : కేరళలో చిల్లర డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడిని హఠాత్తుగా అదృష్ట దేవత వరించింది. ఇక మీదట ఆయన యాచక పాత్ర చిల్లర నాణేల కోసం అన్వేషించక పోవ చ్చు.. ఎందుకంటే  తళతళలాడే నోట్ల కట్టలు ఆయన దరిని చేరబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం నుంచి బతుకుదెరువు కోసం కేరళకు వచ్చిన  పొన్నయ్య అనే 35 ఏళ్ల వికలాం గుడిని కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అక్షయ లాటరీ బంపర్ ప్రైజ్‌మనీ వరించింది. కేరళ-తమిళనాడు సరిహద్దులోని మార్తాండం బస్‌స్టాండ్ వద్ద ప్రస్తుతం నివాసం ఉంటున్న పొన్నయ్య ఒకవైపు యాచకవృత్తి ద్వారా వచ్చిన చిల్లర డబ్బుతో పొట్టనింపుకుంటున్నాడు. మరికొంత నగదును అనం తపురంలో ఉంటోన్న భార్యకు కూడా పంపుతుంటాడు. ఇంకాస్త మిగి లిన డబ్బుతో మరోవైపు ప్రతినెలా లాటరీ టికెట్లను కూడా కొనుగోలు చేస్తుంటాడు.ఎప్పటికైనా లక్షాధికారి కాకపోతానా అన్న ఆశతో ‘పట్టువ దలని విక్రమార్కుడి’లా తన అదృష్టాన్ని పరీక్షించుకునేవాడు. రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి కేరళకు వలస వచ్చి పొన్నయ్యను ఎట్టకేలకు రూ.65లక్షల జాక్‌పాట్ లక్షాధికారిని చేసింది. పొన్నయ్యకు ఈ బంప ర్ ప్రైజే కాకుండా బుధవారం తీసిన లాటరీలో కన్సోలేషన్ బహు మతుల సీరీస్‌లను కూడా గెలుచుకున్నాడు.రూ.90వేల నగదు మొత్తం లభించనుంది. గతనెల పశ్చిమబెంగాల్ నుంచి కేరళకు వచ్చిన 22ఏళ్ల ఓ వలస కార్మికుడికి కూడా ప్రభుత్వ లాటరీ నగదు బహుమతి దక్కింది. అనంతపురానికి చెందిన పొన్నయ్య రోడ్డు ప్రమాదంలో తన కాలును పోగొట్టుకున్నాడు. దీంతో కేరళలోని వెల్లరాడ శివారులో బిచ్చగాడుగా మారాడు. అయితే అతడు అడుక్కున్న డబ్బును బ్యాంక్ ద్వారా తన కుటుంబానికి పంపించేవాడు. లాటరీ టికెట్ బహుమతిని గెల్చుకున్న పొన్నయ్యను స్థానిక ఏజెంట్ వెతుక్కుంటూ వచ్చి ఈ శుభవార్తను చెప్పాడు. అనంతరం అతడి రక్షణ కోసం స్వయంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చాడని సబ్ ఇన్‌స్పెక్టర్ డి.శిభుకుమార్ తెలిపారు.పొన్నయ్యకు లాటరీ ప్రైజ్‌మనీ మొత్తాన్ని ఇప్పించేందుకు పోలీసులు సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు ఆయనను తీసుకెళ్లినట్టు ఎస్‌ఐ చెప్పారు. ఇప్పటికీ వెల్లరాడలోనే ఉన్న పొన్నయ్య తన తండ్రి, సోదరుడితో స్వగ్రామం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడని వివరించారు.