Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

65వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన

SHEKAR

ఢిల్లీ : 65వ జాతీయ చలన చిత్ర  అవార్డుల ప్రకటన కార్యక్రమం ఢిల్లీలో శుక్రవారం ప్రారంభమైంది. బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ ఈ అవార్డులను ప్రకటించారు.  2017లో విడుదలైన తెలుగు, తమిళం , హిందీ, కన్నడ, మలయాళం తదితర భాషల్లో వచ్చిన మంచి చిత్రాలను పరిగణలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యులుగా నటి గౌతమి, ఇంతియాజ్ హుస్సేన్, గేయ రచయిత మెహబూబ్, శేషాద్రి అనిరుద్ధా రాయ్ చౌదరి, రంజిత్ దాస్, రాజేశ్ మపుస్కర్, త్రిపురారి శర్మ, రూమీ జఫ్రే తదితరులు ఉన్నారు. మే3న విజేతలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు.

ఉత్తమ చిత్రాలు, నటులు, దర్శకులు,సంగీత దర్శకులు, కొరియోగ్రాఫర్ తదితరుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తమ నటి : శ్రీదేవి (మామ్)
ఉత్తమ నటుడు : రిద్ధీసేన్ (నగర్ కీర్తన్ – బెంగాలీ)
ఉత్తమ తెలుగు చిత్రం : ఘాజీ
ఉత్తమ హిందీ చిత్రం : న్యూటన్
ఉత్తమ మలయాళీ చిత్రం : టేకాఫ్
ఉత్తమ తమిళ చిత్రం : టు లెట్
ఉత్తమ మరాఠీ చిత్రం : కచ్చా నిబూ
ఉత్తమ కన్నడ చిత్రం : హెబ్బెట్టు రామక్క
ఉత్తమ బెంగాలీ చిత్రం : మయురాక్షి
ఉత్తమ యాక్షన్ చిత్రం : బాహుబలి-2
ఉత్తమ సంగీత దర్శకుడు : ఎఆర్ రెహమాన్ (మామ్, కాట్రు వెలియిదాయ్)
ఉత్తమ కొరియోగ్రాఫర్ : గణేశ్ ఆచార్య ( టాయ్‌లెట్ : ఏక్ ప్రేమ్ కథా)
ఉత్తమ దర్శకుడు జయరాజ్ ( మలయాళ చిత్రం భయానకం)
ఉత్తమ సహాయ నటుడు : ఫహీద్ ఫాసిల్ (తొండిముత్తలం ద్రిసాక్షియుం)

 

 

65th National Film Awards Announcement on Friday

Comments

comments