Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

6,603 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు మంజూరు

Hyderabad : 6,603 junior panchayat secretaries posts are sanctioned

హైదరాబాద్ : తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో 6,603 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రతి గ్రామపంచాయతీకి పంచాయతీ కార్యదర్శి ఉండాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఒకేసారి ఇన్ని పోస్టులను మంజూరు చేయడంపై తెలంగాణ నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

6,603 junior panchayat secretaries posts are sanctioned

Comments

comments