Home స్కోర్ 68 ఏళ్ల రికార్డు బద్దలు!

68 ఏళ్ల రికార్డు బద్దలు!

Murali-vs-Pujara

హైదరాబాద్: ఉప్పల్ స్డేడియంలో టీమిండియా ఆటగాళ్లు మురళీ విజయ్(108), ఛటేశ్వర్ పుజారా(83 పరుగులు) అరుదైన రికార్డు నెలకొల్పారు. భారత గడ్డపై ఓ సీజన్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన భారత జోడీగా అరుదైన ఫీట్‌ను ఈ క్రికెటర్లు తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో దాదాపు 68 ఏళ్ల టెస్టు క్రికెట్ రికార్డు బద్దలైంది. 1948-49 సీజన్లో భారత ఆటగాళ్లు విజయ్ హజారే- రూసీ మోడీ నాలుగు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు.

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్డేడియంలో గురువారం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు తొలి రోజున విజయ్-ఛటేశ్వర్ పుజారా శతక భాగస్వామ్యాన్ని (178 పరుగులు) అందించారు. 2016-2017 సీజన్లో ఇది వీరికి ఐదో శతక భాగస్వామ్యం. దీంతో 1948-49 సీజన్లో విజయ్ హజారే-రూసీ మోడీ సాధించిన నాలుగు శతకాల భాగస్వామ్య రికార్డును విజయ్-పుజారా సవరించినట్లయింది. ఈ క్రమంలో పుజారా మరో అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 1964-65లో చందు బోర్డే సాధించిన అత్యధిక ఫస్ట్ క్లాస్ పరుగులు (1604) రికార్డును పుజారా (1605 పరుగులు) అధిగమించాడు.