Home జాతీయ వార్తలు పరాయి కటకటాలు

పరాయి కటకటాలు

Foreign-prisonsవిదేశీ జైళ్లలో సుమారు 6,800 మంది భారతీయులు మగ్గుతున్నారు. ఇది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులోగల సమాచారం. వారిలో సగం కంటె ఎక్కువ మంది మధ్యప్రాచ్య దేశాల జైళ్లలో ఉన్నారు. ఆ ఖైదీలలో రక్షణ సిబ్బంది, జాలరులు, దేశానికి చెందిన ఇతర పౌరులు ఉన్నారు. విదేశీ జైళ్లలోగల మొత్తం భారతీయులందరిలో అత్యధికంగా 1696 మంది సౌదీ అరేబియా జైళ్లలో, తరువాతి స్థానంలో 1143 మంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో ఉన్నారు. అధికంగా మన ఖైదీలున్న మూడవ దేశం నేపాల్. అక్కడ 859 మంది భారతీయులు జైళ్లలో ఉన్నారు. కువైట్‌లో 434 మంది, మలేసియాలో 356 మంది, బ్రిటన్లో కూడా అంతేమంది, పాకిస్థాన్‌లో 230 మంది అమెరికాలో 188 మంది, మొత్తంమీద 72 దాకా వేర్వేరు దేశాలలో మన దేశ పౌరులు జైళ్లలో ఖైదీలుగా ఉన్నారు. 14 దేశాలలో 100 మంది, మరి 14 ఇతర దేశాలలో కేవలం ఒక్కరు భారతీయులు జైళ్లలో ఉన్నారు. పశ్చిమ దేశాలు తమ జైళ్లలో వేరే దేశాల వారి సమాచారం ఇవ్వరు కనుక విదేశీ జైళ్లలో భారతీయుల సంఖ్య ఇంకా ఎక్కువ కావచ్చు. వారి ప్రైవసీ చట్టాలు చాలా కఠిన నియమాలతో ఉన్నందువల్ల అసమాచారం వారి నుంచి రావడంలేదు. విదేశాలలోని భారతీయ దౌత్య యంత్రాంగాలు అక్కడి సమాచారాన్ని గ్రహించి అందించాయి.
ఎందుకు జైళ్లలో ఉన్నారు?
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం మన వాళ్లు విదేశాల జైళ్లలో వివిధ కారణాలపై ఖైదీలుగా గడుపుతున్నారు.
వలస చట్టాలు, వీసా నిబంధనల ఉల్లంఘన
సక్రమమైన ప్రయాణ పత్రాలు లేకపోవడం
ఆర్థిక నేరాలకు పాల్పడడం
ఉద్యోగ నియామక ఒప్పందాన్ని అతిక్రమించడం
సరైన అనుమతి పత్రంగాని, వీసాగాని లేకుండా పని లో చేరడం
నిషేధం అమలులోగల దేశాలలో మద్యాన్ని సేవించ డం వంటి కారణాలపై వారు జైలుపాలయ్యారు.
జాలరులు తరచూ అరెస్టు
ఇరుగు పొరుగు దేశాల జలాల్లో చేపలు పట్టే జాలరుల ను ఆయా దేశాలు తరచూ బంధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్ జలాలలో అలా జరుగుతూ ఉంటుంది. వారి జలాలతోపాటు భూభాగాల్లోకి అతిక్రమణలకు గాను వారు మన జాలరులను నిర్బంధిస్త్తున్నారు. వారిలో చాలా మందిని తరువాత విడుదల చేసి, వారి పడవలను అప్పగిస్తారు. ఆయా దేశాలతో గల అంగీకారాల ప్రకారం అలా జరుగుతుంది.
మూడేళ్లలో 4,000 మంది జాలర్ల అరెస్టు
2013 నుంచి పై మూడు దేశాలు సుమారు 4,000 మంది జాలర్లను బంధించాయి. వారిలో బంగ్లాలో బందీ అయింది 683 మంది. వారిని తరువాత విడిచిపెట్టారు. కేవలం 2016లో అరెస్టయిన 10 మంది మాత్రమే విడుదల కాకుండా ఉన్నారు. అదే కాలంలో పాకిస్థాన్ 1428 మందిని నిర్బంధించింది. వారిలో 1082 మంది విడుదలయ్యారు. పాకిస్థాన్ జైళ్లలో ఇప్పటికీ 220 మంది భారతీయ జాలరులు ఉన్నట్లు ధ్రువపడని సమాచారం తెలిపింది. 2013 నుంచి శ్రీలంక 2,000 మంది భారతీయ జాలరులను అరెస్టు చేసింది. వారిలో ఇంకా కస్టడీలో ఉన్నవారు 13మందే. తక్కిన అందరినీ విడుదల చేశారు. పాకిస్థాన్ తో మన దేశానికి ద్వైపాక్షిక ఒప్పదంతో పాటు 2008లో కుదిరిన దౌత్య పర్యవేక్షణ అందుబాటులో ఉంది. ఇరు దేశాలకు చెందిన అత్యున్నత న్యాయమూర్తులతో కూడి న కమిటీలు ఉన్నాయి. అవి రెండు దేశాలలోని జైళ్లను సందర్శిస్తూ ఉంటాయి.
జాలరీ ఖైదీల మానవతా విలువలు పాటిస్తున్నారో లేదో వారు పర్యవేక్షిస్తారు. వారిని త్వరగా విడుదల చేయించే లా చర్యలు కూడా తీసుకొంటారు. ఏయే ఖైదీల జైలు కాలం పూర్తయిందో చూసి తక్షణం వారిని విడుదల చే యిస్తారు. శ్రీలంకలో ఆదేశ రక్షణ, మత్స పరిశ్రమల మంత్రిత్వ శాఖలతో సన్నిహితంగా భారతీయ యం త్రాంగం మెలగి, 2008లో కుదిరిన అంగీకారం ప్రకా రం జాలర్ల విడుదల జరిగేలా ప్రయత్నిస్తుంది. అంతేకా కుండా భారత, శ్రీలంక దేశాల జాలరుల సంఘాలతో తరచూ చర్చలు జరుగుతుంటాయి. ఇక బంగ్లాదేశ్ విషయంలో భారతీయ జాలర్ల అరెస్టు సమాచారం వినగానే సంబంధిత జిల్లా యంత్రాంగాన్ని మన యంత్రాంగం సంప్రదించి వారి భారత జాతీయ తను ఖరారు చేసుకొంటుంది. ఆ తరువాత వారి విడుద ల కోసం ఆదేశ అధికారులతో చర్చలు జరుపుతుంది. ఇదే పనిమీద విదేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా దౌత్య పరమైన కృషిని కూడా సాగిస్తుంది. ఖైదులో ఉన్న ప్పటి కాలంలో జాలర్ల యోగక్షేమాల వాకబుకు స్వ చ్ఛంద సంస్థల ద్వారా భారతీయ ప్రభుత్వ యంత్రాం గం కృషి చేస్తుంది.
పాక్‌లో మన రక్షణ సిబ్బంది
74మంది గల్లంతైన మన రక్షణ ఉద్యోగులు పాకిస్థాన్ జైళ్లలో ఉన్నారని మన అధికార్లు భావిస్తున్నారు. వారిలో 54 మంది 1971 నుంచి అక్కడ ఖైదులో ఉన్నారు. పాక్ ప్రభుత్వంతో ఈ విషయాన్ని భారత ప్రభుత్వం చాలా సార్లు ప్రస్తావించింది. దౌత్య మార్గాలలో, ఉన్నత స్థాయి బృందాల మార్పిడి సందర్భాలలో భారత్ తన ప్రయత్నా లను కొనసాగిస్తోంది. అయితే వారు తమ దేశ జైళ్లలో ఉన్న విషయాన్ని పాక్ ధ్రువపరచడం లేదు. సాయుధ ఘర్షణల తరుణంలో ఏర్పడే తగాయిదాలపై ఇరు దేశా లు అంతర్జాతీయ న్యాయస్థానాలను ఆశ్రయించే పరిస్థితి లేదు. దాని పరిథిలోకి ఈ వివాదాలు రావని అధికా రులంటున్నారు.