Home వనపర్తి జిల్లాలో ఘనంగా 68వ గణతంత్ర వేడుకలు

జిల్లాలో ఘనంగా 68వ గణతంత్ర వేడుకలు

ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తాం
జిల్లాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాం
సంక్షేమ పథకాలకు పెద్దపీఠ
ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు
జిల్లాల్లో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీస్ కవాతులు
వేలాదిగా తరళివచ్చి వేడుకలను తిలకించిన ప్రజలు

Collector1

వనపర్తి ప్రతినిధి: రాబోయే ఏడాది నాటికి వనపర్తి జిల్లాను అన్నిరంగాల్లో సర్వతోముఖా భివృద్దికి కృషి చేయనున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి తెలిపారు. నూతన జిల్లాగాఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారిగా వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన 68వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహిం చారు. ఉదయం 8.55 నిమిషాలకు జిల్లాఎస్పీ రోహి ణీ ప్రియదర్శిని తన కార్యాలయం దగ్గర జెండాను ఎగుర వేశారు.  ఉదయం 9.00 గంటలకు కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. 9.02గంటలకు పోలీ సులు సంప్రదాయబద్దంగా కవాతు నిర్వహించారు.

9.15 ని,,లకు , జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి జిల్లా అభివృద్దికి సంబంధించిన వివిధ శాఖల పని తీరుపై ప్రగతి నివేదికను చదివి వినిపించారు. 9.40 ని,,లకు స్వాతంత్య్ర సమరయోధులను కలెక్టర్ కలుసుకుని వారిని శాలువా పూలమాలలతో సన్మానించారు. 10.00 గంటలకు జిల్లాలోని వివిధ మండలాలకు చెందినప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యాక్రమాలు వేడుకలను తిలకించేందుకు వచ్చిన దాదాపు 5000 మంది ని ఆకట్టుకున్నాయి. 11.05 ని..లకు వివిధ శాఖల్లో ఉత్తమ పనితీరును కనబరిచిన అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. 12.05 ని..లకు జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన వారికి ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

అంతకుముందు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణకు హరిత హారం ,మిషన్‌భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌కాకతీయ, వ్యవసాయ శాఖా, ఉద్యానవన శాఖా, పశుసంవర్దక శాఖా, మత్సశాఖా, జిల్లా గ్రామీణాభివృద్ది శాఖా, ఉపాధిహామి, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, స్వఛ్చభారత్ మిషన్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖా, విద్యాశాఖా, విద్యుత్‌శాఖ, పంచాయితీరాజ్ శాఖా, రహదారులు మరియు భవనాల శాఖా, డబుల్‌బెడ్‌రూం పథకం, పౌరసరఫరాల శాఖా, వైద్యఆరోగ్య శాఖా, జిల్లా పంచాయితీ శాఖా, చేనేత మరియు జౌళి శాఖా, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖా, గిరిజన సంక్షేమ శాఖా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా,అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖా, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, పరిశ్రమల శాఖా, సహకార శాఖా, సాదాబైనామాలు, నగదు రహిత లావాదేవీలు, ప్రజావాణి, జిల్లా యువజన మరియు క్రీడల శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది పథకాల ప్రగతి నివేదికను చదివి ప్రజలకు వినిపించారు. వేడుకలకు హాజరైన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎంఎల్‌ఎ చిన్నారెడ్డిలను మర్యాద పూర్వకంగా కలుసుకుని వేదిక పైకి వారిని ఆహ్వానించారు. వారితో పాటు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని , జెసి నిరంజన్ తో కలిసి ప్రశంసా పత్రాలు అందజేశారు.