Home జగిత్యాల వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

Collector Speech in Republic Day

జగిత్యాలటౌన్: జగిత్యాల జిల్లా కేంద్రం లో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనం గా జరిగాయి. జిల్లా కేంద్రంలోని చారిత్రక కట్టడమైన ఖిల్లా లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించా రు. జిల్లా కలెక్టర్ శరత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో శక టాలను ప్రదర్శించారు. కళాకారులు, విద్యార్థుల సాంస్కృ తిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. విశిష్ట సేవ లందించిన అధికారులకు కలెక్టర్ శరత్ ప్రశంసా పత్రాలను అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించా రు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2017 అడుగుల మువ్వన్నెల జెండాను ఖిల్లాలో ప్రదర్శించగా తి లకించేందుకు జనం ఆసక్తి కనబరిచారు.

గణతంత్ర ది నోత్సవ వేడుకల్లో నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జెడ్‌పి చైర్‌పర్సన్ తుల ఉమ, జెసి నా గేంద్ర, మెట్‌పల్లి సబ్ కలెక్టర్ ముషారఫ్ అలీ, జిల్లా ఎస్‌పి అనంతశర్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అ లాగే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జెసి నాగేంద్ర, ఎస్‌పి కార్యాలయంలో ఎస్‌పి అనంతశర్మ, డిఎస్‌పి కార్యాలయం లో డిఎస్‌పి కరుణాకర్, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వి ద్యా సంస్థలు, కోర్టు సముదాయల భవనంలో, వ్యాపార, వాణిజ్య సంస్థలు, రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద, వి విధ కుల, సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో గణతంత్ర దినో త్సవ వేడుకలను నిర్వహించడంతో వాడ వాడలా మువ్వ న్నెల జెండాలు రెపరెపలాడాయి. పట్టణంలో వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ప్రభాత భేరి నిర్వహించి దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేసిన మహనీయులను స్మరించు కున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు, ఆటపా టలు ఆహుతులను ఆలరించాయి.

పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో…

పెన్షనర్ల జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ పెన్ష నర్ల అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరిఅశోక్ కుమార్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం 39 మంది పెన్షనర్లను ఖాదీవస్త్రాలతో, శాలువాలతో సన్మానించి జ్ఞాపి కలు అందజేశారు.

టిఎన్‌జిఓల ఆధ్వర్యంలో…

టిఎన్‌జిఓల సంఘం ఆధ్వర్యంలో 68వ గణతంత్ర దినోత్స వ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సంఘం జిల్లా అ ధ్యక్షుడు బోగ శశిధర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అశోక్‌కుమార్, వ కీల్, కృష్ణ, ప్రభాకర్, సత్యం తదితరులు పాల్గొన్నారు.

ఎబివిపి ఆధ్వర్యంలో…

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహి ంచిన గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర ఉద్యమంంలో పాల్గొని బానిస సంకెళ్లు తెంచిన మహనీయులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు తోట మహేశ్, సతీశ్, జగదీశ్, అనిల్, ప్రేమ్ సాగర్, అరుణ్, వినీత్, సునిల్, కా వ్య, నాగలక్ష్మి, రాజు సాగర్ తదితరులు పాల్గొన్నారు.

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో…

తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకు న్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నలు వాల హన్మాండ్లు, పెద్ది ఆనందం, గంగాధర్, యా

రాయికల్‌లో…

68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాయికల్ మండల వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవే టు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు ఉదయమే ప్రభాత బేరిలో పాల్గొన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన నే తలను స్మరిస్తూ దేశభక్తి గీతాలు అలపిస్తూ ర్యాలీ నిర్వ హించారు. స్వాతంత్య్ర వీరులు, మన సంస్కృతిని తెలిపే వి ధంగా చిన్నారుల వేశాధారణలు ప్రజలను అకట్టుకున్నా యి. బతుకమ్మ, కోలాటలతో చిన్నారుల సాంస్కృతిక ప్రద ర్శనలతో గణతంత్ర దినోత్సవం కన్నుల పండువగా జరి గాయి. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చంద్ర్ర కాశ్, ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిపి పడాల పూర్ణిమా, ఐకెపి కార్యాలయంలో ఎపిఓ శ్రీనివాస్‌చక్రవర్తి, పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ లక్ష్మినారాయణ, ఎఫ్‌ఆర్‌ఓ కార్యాలయ ంలో రేంజర్ నరేంధర్‌రావు, గ్రామపంచాయతీలో సర్పంచ్ డాక్టర్ తురగ రాజరెడ్డి, ఎంఆర్‌సిలో ఎంఇఓ శ్యాంసుం దరచారీ,ట్రాన్స్‌కో కార్యాలయంలో ఎఇ శ్రీనివాస్‌లు జా య పతాకాన్ని ఎగురవేశారు. రాయికల్ పట్టణంలోని ప్ర ణుతి, శ్రీనిధి జూనియర్ కాలేజీలు, ప్రగతి, వివేకవర్ధిని, విశ్వశాంతి, కృష్ణవేణి,గ్లోబల్, విద్యాభారతి హైస్కూల్‌లలో గణతంత్ర వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. చిన్నా రుల వేశాధారణలు, నృత్య ప్రదర్శనలు అకట్టుకున్నాయి. కాగ రామాజీపేట, ఇటిక్యాల, కుమ్మరిపెల్లి, భూపతిపూర్, ఆలూర్,వీరాపూర్.చెర్లకొండాపూర్,అల్లీపూర్ తదితర గ్రా మాల్లో గణతంత్ర దినోత్సవ వేడులకలు ఘనంగా జరిగా యి.ంసాని హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

కొడిమ్యాలలో…

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేం ద్రంలో గురువారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్, వివిధ రాజకీయ పార్టీ కార్యాలయాల ముందు త్రివర్ణపతాకాన్ని ఎగరవేసి 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి మేనేని స్వర్ణలత, తహసీల్ధార్ కార్యాలయంలో తహసీల్ధార్ వెంకట లక్ష్మీ, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పిడు గు ప్రభాకర్‌రెడ్డి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ కిరణ్‌కుమార్, ఐకెపి కార్యాలయంలో ఎపిఎం రజిత ఆయా గ్రామ పంచా యతీ కార్యాలయాల ముందు సర్పంచ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఎంపిఇఓ కార్యాల యంలో ఎంఇఓ వెంకటేశ్వర్‌రావు, సింగిల్ విండో కార్యాల యంలో విండో చైర్మన్‌లు మల్లిఖార్జున్‌రెడ్డి, కృష్ణారావు, ల కా్ష్మరెడ్డిలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

సారంగాపూర్‌లో…

గణతంత్ర దినోత్సవ వేడుకలను మండలంలోని ప్రజాప్ర తినిధులు, అధికారులు ఘనంగా నిర్వహించుకొని స్వీట్లు పంపిణీ చేశారు. మండలంలో పాఠశాలల విద్యార్థులు వివి ధ వేషధారణలతో పురవీధుల గుండా తిరుగుతూ నినా దాలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్లు వెంకటర మణ, హన్మంతరెడ్డి, ఎంపిడిఓ పుల్లయ్య, జెడ్పీటీసీ సభ్యురా లు భూక్య సరళ, ఎంపిపి కొల్ముల శారద, వైస్ ఎంపిపి, కొండ్ర రాంచందర్‌రెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మల్యాలలో…

మల్యాల మండలంతో పాటు ఆయా గ్రామాల్లో గురువారం గణంత్ర దినోత్సవ వేడుకలను కన్నుల పండువగా నిర్వ హించారు. తహసీల్ధార్ కార్యాలయంలో తహసీల్ధార్ శ్రీహ రిరెడ్డి, పోలీస్‌స్టేషన్‌లో సిఐ కృపాకర్‌రెడ్డి, ఎంపిడిఓ కా ర్యాలయంలో ఎంపిడిఒ శ్రీనివాసమూర్తి, సోనియా గాంధీ గుడి వద్ద మండల పార్టీ అధ్యక్షుడు నెల్ల రాజేశ్వర్‌రెడ్డిలు జా తీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు.

వేములవాడలో…

గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజన్నసిరిసిల్ల జిల్లా లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన శకటల ప్రదర్శనలో రాజరా జేశ్వరస్వామి ప్రచారరథం ఆకర్షణగా నిలిచింది. ప్రచార రథానికి ఆలయ అధికారులు, పూలతో అందగా ముస్తాబు చేశారు. పరేడ్ గ్రౌండ్‌లోని అధికారులకు, చూపర్లను ప్రచా రం రథం ఆకట్టుకుంది. ప్రచార రథానికి ప్రథమ బహుమ తిని కలెక్టర్ కృష్ణభాస్కర్ అందించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ఈవో దూస రాజేశ్వర్, ఎఈవోలు ఉమారాణి, తిరుపతిరావు, నామాల రాజేందర్, ఉపాధ్యాయుల చంద్రశేఖర్, నట్‌రాజ్, అశోక్, రాజశేఖర్, శ్రీరాములులతో పాటు ఆర్చకులు, తదితరులు ఉన్నారు.

రామగిరిలో…

రామగిరి మండలం సెంటినరికాలనీ,రత్నాపూర్,కల్వచర్ల, బేగంపేట్, నాగెపల్లి,లద్నాపూర్,ఆదివారంపేట, రామ య్యపల్లి గామాల్లో గురువారం ఘనతంత్ర వేడుకలను ఘ నంగా నిర్వహించారు. రామగిరి తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ ఉమాశంకర్, పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ శం కరయ్య యాదవ్ జెండాలను ఎగురవేశారు, ఆదేవిధంగా పన్నూర్ సెంటర్‌లో పన్నూర్ ఎంపిటిసి శ్రీనివాస్,సెంటినరి కాలనీలో ఎంపిటిసి మొలుమూరి, ఆశ కుమారి, రత్నాపూ ర్‌లో సర్పంచ్ బోగె లింగయ్య, పల్లె ప్రతిమ పివి రావు, క ల్వచర్లలో సర్పంచ్ రేండ్ల అశోక్, బేగంపేట్‌లో సదానందం, నాగెపల్లిలో సర్పంచ్ బాబురావు తమ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేసారు.కార్మిక క్షేత్రమైన సెంటినరికాలనీలోని వివిద యూనియన్ కార్యా యాల్లో ఆయా కార్మిక సంఘాల నాయకులు జెండాలను ఎగురవేసారు, అదేవిధంగా ఆర్జీ-౩ డివిజన్‌లోని బొగ్గు గ నుల మీద కార్మిక సంఘాల నాయకులు జెండాలను ఎగుర వేసి సంభరాలు జరుపుకున్నారు.

భగత్‌నగర్‌లో…

స్థానిక భగవతీ స్కూల్స్, భగత్‌నగర్ పాఠశాలలో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభాతభేరితో విద్యార్ధిని, విద్యార్ధుల నినాదాలు పురవీధులలో మార్మోగాయి. పాఠశాలల చైర్మన్ రమణ రావు పతాకావిష్కరణతో జాతీయ గీతాలాపనతో ఝండా వందనం సమర్పించారు.ఈ సందర్బంగా పాఠశాలల చైర్మన్ బి.రమణరావు మాట్లాడుతూ ఎందరో మహానీయు లు మనకు అందించిన ఈ అపురూపమైన జాతికే గర్వకా రణమైన మన జాతీయ ఝండా రక్షణ ప్రతి భారతీయుని కర్తవ్యమని, సమాజంలో జరిగే అన్యాయాలను ఎదుర్కొ నడానికి ప్రతి విద్యార్ధి ముందుండాలని సూచించారు.

హుజూరాబాద్‌టౌన్‌లో…

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, వాణిజ్య వ్యాపార సముదాయాల్లో వేడుక లు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠ శాలల, కళాశాలల ప్రిన్సిపాళ్లు జెండావిష్కరించారు. హు జూరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జగ త్‌సింగ్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఉషశ్రీ,హు జూరాబాద్ నగరపంచాయతీ కార్యాలయంలో నగరపంచా యతీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, ఆర్డీవో కార్యాలయ ంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మల్లారెడ్డి, హుజూ రాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మా ర్కెట్ కమిటీ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణా రావులతో పాటు వాణిజ్య, వ్యాపార సముదాలయాల్లో ఆ యా యాజమానులు జెండావిష్కరించారు. అనంతరం పా ఠశాలల్లో, కళాశాలల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కా ర్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఓదెలలో…

గణతంత్రదినోత్సవ వేడుకలను ఓదెల మండలంలో ఘ నంగా నిర్వహంచారు. గురువారం ప్రభుత్వ ప్రైయివేట్ స ంస్థలలో జెండా పండుగను జరుపుకున్నాడు. ఓదెల తహసీ ల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఉదయ్‌కుమార్, మండ ల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి రమాదేవి, వ్యవసాయా ధికారి కార్యాలయంలో ఎఒ నాగార్జున, ప్రాధమిక ఆరోగ్య కేంధ్రంలో వైద్యురాలు దీప్తి, ఎంఇఒ కార్యాలయంలో ఎ ఇఒ సరళ, సెప్ కార్యాలయంలో సిసి శ్రీనివాస్, జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పొత్కపల్లి పోలీస్టేష్‌లో ఏఎస్సై ప్రసాదరావు, సింగాల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, ఓదెల మల్లిఖార్జున స్వామి ఆలయంలో ఈవో మారుతి, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలలో , బ్యాంకులలో, పొత్కపల్లి , ఓదెల, కొలనూర్ రైల్వేస్టేషన్‌లో, పోస్టాఫీసుల లో జెండాలను ఆవిష్కరించారు. ఓదెల జిపి కార్యాలయ ంలో సర్పంచ్ ఆకుల మహేందర్, కొలనూర్ జిపి కార్యాల యంలో సర్పంచ్ ఖైరున్సీస్సా తాజ్, పొత్కపల్లి జిపి కార్యా లయంలో సర్పంచ్ గడ్డం లక్ష్మీ, కనగర్తి జిపి కార్యాలయం లో సర్పంచ్ మధుసూదన్‌రావు, గోపరపల్లి పిపి కార్యాల యంలో సర్పంచ్ తుంగాని సాయిలు, హరిపురం జిపి కా ర్యాలయంలో సర్పంచ్ స్వరూపమహేందర్‌రెడ్డి, గుంపుల జిపి కార్యాలయంలో సర్పంచ్ ఉప్పుల సంపత్‌కుమార్, జా తీయ జెండాలను ఎగురవేశారు. ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు, కొలనూర్‌లో ఈర్ల సదయ్య, జెండావిష్కరిం చారు. గణతంత్ర వేడుకల్లో మాజీ ఎంపిపి రాములు, యకులు రెడ్డిశ్రీనివాస్, పల్లె కుమార్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, చి న్నస్వామి, వైస్ ఎంపిపి పోతుగంటి రాజు, ఎంపిడివో ర వీందర్, ఎంపిటిసిలు, సర్పంచ్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.

ధర్మపురిలో…

ధర్మపురి మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకను అత్య ంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు వివిద వేశోద్దార ణలతో ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యా లయాల్లో జెండాను ఎగరవేశారు. తహసీల్దార్ కార్యాలయ ంలో తహసీల్దార్ కుందారపు మహేశ్వర్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిపి కొండపెల్లి మమత, ధ ర్మపురి సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ బాదినేని రా జేందర్, ఎఎమ్‌సిలో చైర్మన్ అల్లం దేవమ్మ, పోలీస్‌స్టేషన్‌లో సిఐ సిహెచ్ శ్రీనివాస్, ఐకెపిలో ఎపిఎమ్ రామాదేవి, మేజ ర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సింగి స త్తమ్మ, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎంపిపి మమత, టిఆర్‌ఎస్ కాంగ్రేస్, టిడిపి పార్టి కార్యాయాల సింగిల్‌వి ండో చైర్మన్ బాదినేని రాజేందర్, పెరుమల్ల ఎల్లగౌడ్, గడ్డం బాస్కర్ రెడ్డిలు జాతీయ జెండాను ఎగరవేశారు.

కాల్వశ్రీరాంపూర్‌లో…

మండలంలో గురువారం 68వ గణతంత్ర దినోత్సవ వేడు కలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయా లు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థల ఆఫీసులపై మువ్తన్నెల జెండాలు రెపరెప లాడాయి. పలు పాఠశాలల్లో క్రీడాపోటీ లు, సాంస్కృతిక ప్రధర్శనలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. మండల పరిషత్ కార్యాలయ ంలో ఎంపిడివో సురేష్, రెవెన్యూ కార్యాలయంలో తహసీ ల్దార్ కె.వై.ప్రసాద్, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై ఉమాసాగర్, ఆసుపత్రిలో డా॥ మహేందర్, ప్రభుత్వ జూనియర్ కళాశా లలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, మోడల్ స్కూల్ లో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, హైస్కూల్‌లో హెచ్‌ఎమ్ పద్మ, ఆయాగ్రామ పంచాయితీలల్లో సర్పంచ్‌లు జాతీయ జెండాను ఎగుర వేశారు.