Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

వాడ వాడలా మువ్వన్నెల జెండా

15mdcgtp01cచేగుంట: స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా చేగుంట మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో ఉదయం నుండి జెండా పండుగ నిర్వహించారు. ఏ గ్రామంలో చూసినా విద్యార్థులచే ఉరేగింపులు, వివిధ వేశదారణలతో ర్యాలీలు. చేగుంటలో దీప్తి విద్యాలయం,గాయత్రిటెక్నో స్కూల్ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల, పలు దేవుళ్ల వేశాలు వేసి, పుర వీదుల గుండా ర్యాలీగా తిరిగారు. శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం సుమారు 300 మీటర్ల జెండాను తీసుకుని ఉరేగింపుగా చేగుంటలో తిరిగారు . చేగుంట పోలీస్‌స్టేషన్‌లో యస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి,తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ నిర్మల, యంపిడిఒ కార్యాలయం వద్ద యంపీపీ అల్లిరమ, వ్యవసాయ కార్యాలయం వద్ద ఎఒ చైతన్య, మండల వనరుల కార్యాలయం వద్ద యంఇఒ లింగారెడ్డి, ఐకేపీ వద్ద యాదమ్మ, గ్రామపంచాయితి వద్ద యంపిడీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, వైశ్యసంఘం తో పాటు పలుగ గ్రామాలలో జెండా ఆవిష్కరించి స్వాతంత్య్ర పోరాటాల గురించి వివరించారు.

independencedayఆకట్టుకున్న వేశదారణాలు: చేగుంటలోని గాయత్రిటెక్నో పాఠశాల విద్యార్థులు వేసిన వివిద ఆకృతుల్లోని వేశదారణాలు పలువురిని ఆకట్టుకున్నాయి,ముఖ్యంగా తెలంగాణతల్లి, పోతరాజు, బోనాలు, భగత్‌సింగ్, పోలీస్, గాంధీ, రైతు,సీతారాములు,నెహ్రూ,కోయ, గోండు,చెంచు,డాక్టర్, క్రిస్‌మస్‌బోమ్మలతో పాటు పలు వేశాలు వేసారు.

Comments

comments