Home అంతర్జాతీయ వార్తలు యెమెన్‌లో బాంబుదాడి: ఏడుగురి మృతి

యెమెన్‌లో బాంబుదాడి: ఏడుగురి మృతి

BOMBయెమెన్‌ : బాంబాలు నింపిన ఓ వాహనం పేలి యెమెన్‌లో ఏడుగురు సైనికులు మృతి చెందారు. ఆదివారం యెమెన్ దక్షిణ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో 14మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. సైన్యం కాన్వాయిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది. ఈ దుశ్చర్యకు అల్‌ఖైదా వర్గాలే కారణమని సైన్యం ఆరోపించింది. ఇక్కడ సంకీర్ణ దళాలు అల్‌ఖైదాపై వైమానిక దాడులు నిర్వహిస్తున్నాయి.