Home జాతీయ వార్తలు బస్సును ఢీకొన్న ట్రక్కు: ఏడుగురు మృతి

బస్సును ఢీకొన్న ట్రక్కు: ఏడుగురు మృతి

Accident

మణిపూర్: ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర  రోడ్డు ప్రమాదం  చోటు చేసుకుంది. అతి వేగంగా వస్తున్న ట్రక్కు అదుపు తప్పి బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో 7గురు మృతి చెందగా, 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు ప్రారంభించారు.

7 killed in road accident on agra lucknow expressway