Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి…

 Ranchi found dead in house

రాంచీ: ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందిన సంఘటన జార్ఖండ్ లోని రాంచీలో చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో ఇద్దరు సోదరులు, తండ్రి, ఇద్దరు మహిళలు , ఒక చిన్నారి ఉన్నారు. ఇద్దరు సోదరులు కుటుంబంలోని మిగితా వారిని చంపేసినట్లు పోలీసులు  నిర్ధారణకు వచ్చారు. తండ్రితో పాటు చిన్నారులు ఉరి వేసుకున్నట్లు, తల్లిని మాత్రం పదునైన కత్తితో పొడిచినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత సోదరులు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుల ఇంటి వద్ద 15 పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టమ్ అనంతరం మరిన్ని విషయాలు తెలుస్తాయని డిఐజి హోంకార్ తెలిపారు.

Comments

comments