Home జాతీయ వార్తలు మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి

7 People Dies In Road Accident In MahaRastra State

ముంబయి: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన  సంఘటన గడ్చిరౌలి జిల్లాలోని గోవిందగావ్‌ వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. స్థానికులు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాలలోకి వెళితే.. స్థానికులు తెలిపిన ప్రకారం..చంద్రభూన్‌ నుంచి కాళేశ్వర్‌ వెళ్తున్న కారు.. ఎదురుగా వస్తున్న సెవన్‌ సీటర్‌ వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న వాళ్లలో ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు, సెవన్ సీటర్‌ వాహన డ్రైవర్‌, మరో చిన్నారి మృతి చెందారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మృతదేహలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.