Home రాష్ట్ర వార్తలు 7న ప్రధాని రాక

7న ప్రధాని రాక

PMModi-condelence-to-japan-భగీరథ పనులు ప్రారంభం, మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరణ, భారీ బహిరంగసభకు బిజెపి ఏర్పాట్లు

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 7న రాష్ట్రానికి రానున్నారు. మిషన్ కా కతీయ పైలాన్ ఆవిష్కరణతో పా టు మిషన్ భగీరథ పనులను ప్రా రంభించనున్నారు. సిఎం కెసిఆర్ ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భం గా ప్రధానిని కలిసి రాష్ట్రంలో చేప డుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలను వివరించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులను తెలియజేసిన ఆయన ఈ పథకాలకు నిధులను కేటాయించాలని కోరారు. అంతేకాకుండా వరంగల్‌లో ఏర్పాటు చే సిన మిషన్ భగీరథ పైలాన్‌ను ఆవిష్కరించాలని, గజ్వేల్ సమీపంలో మిషన్ భగీరథ పనులకు శం కుస్థాపన చేయాలని కోరారు. రాష్ట్ర పర్యటన సమ యమిస్తే ఏర్పాట్లు చేస్తామని కెసిఆర్ కోరడంతో ఆగస్టు 7న రాష్ట్రానికి వచ్చేందుకు మోడీ సమయ మిచ్చారు.
బహిరంగసభకు
బిజెపి నిర్ణయం
ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఘ న స్వాగతం పలకడంతో పాటు భా రీ బహిరంగసభను ఏర్పాటు చేయా లని బిజెపి రాష్ట్ర నాయకులు నిర్ణ యించారు. కార్యకర్తల మహా సమ్మేళనం పేరుతో దాదాపు లక్ష మందితో సభను నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి పోలింగ్ బూత్ స్థా యిలో నుంచి మొత్తం ఆరుగురిని బహిరంగసభకు ఆహ్వానించాలని, ఇందులో ఒకరు మహిళ ఉండా లని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు. అ యితే బహిరంగ సభను హైదరాబాద్‌లో నిర్వహిం చాలా లేక జిల్లాలలోనా అనే విషయాన్ని ఫైనల్ ఇంకా ఖరారు చేయలేదు.
పేర్లు మార్చి నిధులు వాడుతున్నారు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి కేం ద్రం ఆర్థిక సహాయం అందిస్తోందని బిజెపి శాసన సభాపక్ష ఉప నేత ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నా రు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింతా సాంబమూర్తి, జి, ప్రేమేందర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్ తదితరులతో కలిసి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 7న ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటన సందర్భంగా కేంద్రం ఇచ్చిన నిధు లను ప్రజలకు తెలియజేస్తామని ఆయన పేర్కొ న్నారు. మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఎస్‌సి వర్గీకరణ, హైకోర్టు విభజనపై కూడా స్పష్టత ఇవ్వ నున్నారన్నారు.