Home జాతీయ వార్తలు యుపిలో 70మంది ఐపిఎస్‌ అధికారుల బదిలీ

యుపిలో 70మంది ఐపిఎస్‌ అధికారుల బదిలీ

FINAL1లక్నో: యుపి రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 70 మంది ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బదిలీ అయినవారిలో పలువురు పోలీస్ బాస్‌లు ఉండడం విశేషం. ఫిరోజాబాద్, షామ్లి, కాన్పూర్, మైన్‌పురి, మథుర, ఫైజాబాద్, ముజఫర్‌నగర్, కాన్పూర్ రూరల్, హోర్డోయి, చిత్రకూట్, జలాన్ తదితర ప్రధాన ప్రాంతాల పోలీస్ చీఫ్‌లను ప్రభుత్వం బదిలీ చేసినట్లు హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, యుపిలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు దుమారం రేపుతున్న తరుణంలో ఈ బదిలీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.