Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

కొలంబియాలో కుప్పకూలిన విమానం

76 మంది దుర్మరణం, మృతుల్లో ఫుట్‌బాల్ క్రీడాకారులు

Helicopter

బొగొటా : కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టుతో పాటు పలువురు ప్రయాణిస్తున్న విమానం పర్వతాల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో 76మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం నుంచి ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. చికిత్సకోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఒకరు మృతి చెందారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు ఆటగా ళ్లు, ఒకరు జర్నలిస్టు, మరొకరు విమాన సిబ్బంది ఉన్నారు. 72మంది ప్రయాణికులు, 9మంది సిబ్బందితో బొలీవియా కు చెందిన రియోనిగ్రోలోని జాస్ మరయా కార్డోవ అంత ర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం బయల్దేరిం దని అధికారులు పేర్కొన్నారు.

కొలంబియాలోని మెడిలిన్ పర్వత ప్రాంతాల్లో మంగళవారం ఉదయం పది గంటలకు కూలిపోయింది. బ్రెజిల్ చాపికోయిన్స్ ఫుట్‌బాల్ జట్టు, కోపా సుదామెరికన్ టోర్నీ ఫైనల్స్‌లో భాగంగా అట్లెటికో నసియోనల్‌తో బుధవారం జరిగే మ్యాచ్ కోసం బయల్దేరిం ది. విమానంలో విద్యుత్ వ్యవస్థ విఫలమైందని, అత్యవస రంగా దిగడానికి అనుమతించాలంటూ సంకేతాలందిన కాసేపటికే ప్రమాదం జరిగిపోయిందని లామియా ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

విమానం కూలిన ప్రాంతంలో సముద్ర మట్టానికి 3,300మీటర్ల ఎత్తులో ఉందని సమీప పట్టణం లా సెజా మేయర్ ఎల్కిన్ వివరిం చారు. సహాయక చర్యలు చాలా ఇబ్బందిగా ఉందని తెలిపారు. హెలికాప్టర్లను రంగంలోకి దించుతున్నట్టు విమానయాన సంస్థ వెల్లడించింది. ఇదిలావుండగా విమానంలో ఇంధనం అయిపోయినందువల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదంలో మృతి చెందిన క్రీడాకారులకు సాకర్ క్లబ్ నివాళులర్పించింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. క్రీడాకారుల మృతిపట్ల బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమెర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశంలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని సూచించారు.

Helicopter1

Comments

comments