Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

వైద్యుల నిర్లక్ష్యంతో పది రోజుల పసి పాప మృతి

infant-died* నగరంలోని స్టార్ చిల్డ్రాన్ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం
* మృతి చెందిన పాప శవంతో ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన 
* ఆసుపత్రి , వైద్యుల పై రూరల్ పోలీస్ స్టేషన్ లో బాధితుల ఫిర్యాదు
కరీంనగర్ క్రైమ్ : వైద్యుల నిర్లక్ష్యంతో పది రోజుల పసి బిడ్డను పొట్టన పెట్టుకున్నరంటూ…ఆరోపిస్తూ..కరీంనగర్ లోని ఓ ప్రవేట్ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్టార్ చిల్డ్రన్ ఆసుపత్రిలో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నగునూర్ గ్రామానికి చెందిన సతీష్ – రూపకళా దంపతులకు గత పది రోజుల క్రితం మంచిర్యాల లోని చైతన్య ఆసుపత్రిలో రూపకళా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.

పుట్టిన పాపకు శ్వాస సంబంధిత సమస్య రావడంతో అక్కడ ఆసుపత్రి వైద్యులు అదే సాయంత్రం కరీంనగర్‌లోని స్టార్ చిల్డ్రన్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో స్టార్ ఆసుపత్రిలో చేర్పించిన తల్లిదండ్రులు పది రోజులపాటు పాపకు వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాసతో చికిత్స అందించారు. పది రోజులు చికిత్స అందించిన స్టార్ ఆసుపత్రి వైద్యులు పలు రకాల పరీక్షల నిమిత్తం 1 లక్ష 50 వేల రూపాయలు బిల్లు వేశారు. దీంతో పాప తల్లిదండ్రులు తమ స్వగ్రామంలో ఉన్న పొలం, బంగారం అమ్మి సదరు ఆసుపత్రిలో బిల్లు చెల్లించారు. అయిన మరో 40 వేల రూపాయాలు చెల్లించాలని ఆసుపత్రి సిబ్బంది పాప బంధువులకు ఆసుపత్రి బిల్లులు ఇచ్చారు. కాగా పాప అప్పటికే మృతి చెందిన విషయం పాప తల్లిదండ్రులకు చెప్పకుండ..ఆసుపత్రిలో అయిన మొత్తం బిల్లు చెల్లించిన తర్వాత చెబుదాములే అని పాప చనిపోయిన విషయం చెప్పకుండా దాచిపెట్టారు.

దీంతో అనుమానం వచ్చిన బందువులు ఆసుపత్రి వైద్యులను నిలదీయ్యడంతో పాప చనిపోయిన విషయం సోమవారం వెళ్లడించారు. ఆసుపత్రి వైద్యులు పాపకు చాతి భాగంతో రంధ్రం లాంటింది చేసి శ్వాసను అందించే ప్రయత్నం చేశారు. దీంతో పాప వైద్యులు అంధించిన కృత్రిమ శ్వాసను తట్టుకోలేక సోమవారం తెల్లవారుజామున ముక్కులో నుంచి, నోట్లో నుంచి రక్తస్రావం కావడంతో పసిపాప మృతిచెందింది. వైద్యుల నిర్లక్షం వల్లనే…పసి పాపను పొట్టన పెట్టుకున్నారని..తమ కు జరిగిన అన్యాయం మరిఎవరికి జరగవద్దని..తమకు న్యాయం చేయ్యాలని డిమాండ్ చేస్తూ…మృతి చెందిన పాపతో బందువులు స్ట్రార్ చిల్డ్రాన్ ఆసుపత్రి ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు.
పాప మృతి పై తమ ఆసుపత్రి ఎలాంటి నిర్లక్షం లేదు
చనిపోయిన పాప విషయంలో తమ ఆసుపత్రి వైద్యుల నిర్లక్షం ఏ మాత్రం లేదని స్టార్ చిల్డ్రాన్స్ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. మంచిర్యాల నుంచి తమ ఆసుపత్రి వచ్చిన పాపకు శ్వాస సంబంధిత సమస్యతో తమ ఆసుపత్రిలో అడ్మిట్ అయిందని…పాపకు ఉన్న సమస్య పది వేలలో ఒకరికి ఉంటుందని వైద్యులు తెలిపారు. పాపకు గుండె చుట్టు ప్రక్కల ఎక్కువగా గాలి చేరడంతో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందికి గురికావడం జరిగిందని, పాపను కాపడేందుకు తమ వంతు కృషి చేశామన్నారు. తమ ఆసుపత్రికి పాపను చివరి స్టేజ్‌లో తీసుకురావడం వల్ల అలాజరిగిందని స్ట్రార్ చిల్డ్రాన్ ఆసుపత్రి పిల్లల వైద్య నిపుణులు స్పష్టం చేశారు.

Comments

comments