Search
Saturday 22 September 2018
  • :
  • :

సృష్టికి..ప్రతిసృష్టి ఫోటోగ్రఫి

18nzblk25p5ప్రకృతి ఛాయ…. ఫోటోగ్రఫి …నేడు ప్రపంచ ఛాయ చిత్ర దినోత్సవం
నిజామాబాద్ సాంస్కృతికం: సృష్టికి..ప్రతిసృష్టి ఫోటోగ్రఫి, ఫోటోగ్రఫి అంటేనే కళాత్మకత.. ఓ సృజనాత్మకత వేయి పదాలు పలికించలేని భావాన్ని ఒక ఛాయాచిత్రం చెబుతుందంటారు. చిత్రంలో ఎంతో భావుకత దాగుంటుదనటంలో ఏమాత్రం సందేహం లేదు. వివాహమైన..పుట్టినరోజైన..నిశ్చితార్ధమైన..ఇలా ఎక్కడ శుభకార్యం జరిగిన ఆ జ్ఞాపకాలను పదికాలాలు పదిలంగా బందించడానికి కావల్సింది ఫోటోగ్రఫీ. అందుకనే మానవుని దైనందిన జీవితంలో ఫోటోగ్రఫి ఒక భాగమైపోయింది. నాటి బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి నేటి డిటలైజేషన్ వరకు ఛాయచిత్రాల్లో అనేక మార్పులు సంతరించుకొన్నాయి. ఆగస్ట్ 19 బుధవారం ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం సందర్బంగా మన తెలంగాణ ప్రత్యేక కథనం.
లూయిస్ జాకురెస్ డాక్యురే
మొట్టమొదటి సారిగా ఛాయాచిత్రాలను తయారు చేయటానికి శ్రీకారం చుట్టింది ఫ్రాన్స్ దేశానికి చెందిన లూయిస్. 1553లో బిఫోర్ట్ అనే సాధరణ వ్యక్తి కెమెరాను కనిపెట్టాడు. అయితే లూయిస్ మొదట గాజు పలకపై కొన్ని రసాయానాలను పోసి ఛాయా చిత్రాన్ని రూపొందించాడు. అది ఆగస్ట్ 19న కావటంతో ఆనాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఫోటోగ్రఫి దినోత్సవం జరుపుకోవటం అనావాయితి అయ్యింది.
18nzblk25p2జిల్లాలో ఫోటోగ్రఫి…
ఛాయాచిత్రం ఆరంభమైన రోజుల్లో నిజామాబాద్ జిల్లాలో కేవలం 6 ఫోటో స్టూడియోలుండేవి. ఎక్కువగా జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతంలో ఉండేవని సినియర్ ఫోటోగ్రఫర్‌లు చెబుతుంటారు. నగరంలో మొదటి సారిగా మింటో ఫోటోగ్రఫిని తీసుకవచ్చింది రాములు అనే సినియర్ ఛాయాగ్రహకుడు, తదనంతరం జిఆర్, రాములు స్టూడియోలు వెలసాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి అప్పటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ హజరై ప్రసగించిన చిత్రాలను జిఆర్ స్టూడియో ఫోటోగ్రఫర్ గంగారం చిత్రికరించారు. ప్రస్తుతం ఇందూర్ నగరంలో 150 వరకు ఫోటోస్టూడియోలు జిల్లా మొత్తంగా 4 వేలకు పైగా ఫోటోస్టూడియోలు ఉంటాయని అంచనా.

18nzblk25p4దిగంబర్ సీనియర్ ఫోటోగ్రఫర్
ప్రకృతిలోని అందాలను… వివిధ శుభకార్యాలకు సంబంధించిన ఫోటోలను గత 45 సంవత్సరాలనుంచి ఫోటోలు తీస్తున్నాను. నాటి నలుపు తెలుపు కాలానికి నేటి డిజటలైజేషన్ వరకు అనేక మార్పులు సంతరించుకున్నాయి. ఫోటోలు తీయటం నాకు ఆరోప్రాణం. కొత్త మార్పులతో సెల్‌ఫోన్ చిత్రాలు, వాట్స్‌ఆప్ చిత్రాలు నేడు అందరికి అందుబాటులో ఉన్నాయి. 18nzblk25p3

Comments

comments