Home నాగర్ కర్నూల్ స్వయం పాలన దిశలో గిరిపుత్రులు

స్వయం పాలన దిశలో గిరిపుత్రులు

77 new gram panchayats

 

నూతన గ్రామ పంచాయతీల్లో అధిక శాతం గిరిజనులకే అవకాశం
అచ్చంపేట నియోజక వర్గంలో 56 ఏజెన్సీ గ్రామ పంచాయతీలు
మరో నలభై పంచాయతీలలో గిరిజనులకే అవకాశాలు ఎక్కువ
నియోజక వర్గంలో నూతనంగా 77 గ్రామ పంచాయతీలు
తమను తాము పాలించుకోనున్న గిరిజనులు 

మనతెలంగాణ/అచ్చంపేట: ఎన్నో ఏళ్లుగా పంచాయతీలకు అనుబందంగా కొనసాగిన తాండాలు, గూడాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పంచాయతీలుగా రూపొందించుకోవడంతో దశాబ్దాల తర్వాత తమను తాము పాలించుకునే సువర్ణ అవఖాశం లభించింది. గతంలో పెద్ద గ్రామాలుగా ఉన్న గ్రామ పంచాయతీలకు అనుబందంగా ఉంటూ తీవ్ర సమస్యలు ఎదర్కున్న తాండాలు, గూడాల ప్రజలకు ఊరట నిచ్చేలా 500 జనాభ కలిగిన ప్రతి గ్రామాన్ని గ్రామ పంచాయతీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అచ్చంపేట నియోజక వర్గంలో అచ్చంపేట, అమ్రాబాద్, పదర, వంగూరు, చారగొండ, ఉప్పునుంతల, బల్మూర్, లింగాల మండలాలు ఉండగా నూతనంగా 77 నూతన గ్రామ పంచాయతీలుగా ఏరప్పడ్డాయి. గతంలో 103 గ్రామ పంచాయతీలు ఉండగా అచ్చంపేట మలంలోని పల్కపల్లి, లింగోటం, పులిజాల, గుంపన్ పల్లి, లకా్ష్మపూర్, చౌటపల్లి, నడింపల్లి గ్రామాలతో పాటు, బల్మూర్ మండలంలోని పోలిషెట్టి పల్లి గ్రామాలు అచ్చంపేట మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. పాత 95 గ్రామ పంచాయతీలతో పాటు కొత్తగాఏర్పడిన 77 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగనుండగా ఇందులో ఎక్కువస్థానాలలో గిరిజనులే పోటీ చేయనున్నారు.

55 ఏజెన్సీ గ్రామ పంచాయతీలు
నియోజక వర్గంలో విస్తరించిఉన్న నల్లమల ప్రాంతంలో 55 ఏజెన్సీ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలో కేవలం గిరిజనులే పోటీ చేయాల్సి ఉండగా, మరో 20 గ్రామాలలో వంద శాతం ఎస్టీ జనాభ కలిగి ఉండడంతో అవికూడా గిరిజనులకేటాయించాల్సి ఉంటుంది. పాత పంచాయతీల ప్రకారం 103 పంచాయతీల్లో 31 గ్రామ పంచాయతీల పరిదిలో 70 గ్రామాలు ఏజెన్సీ ప్రాంతం క్రిందకు వచ్చేవి. దాదాపు ఏజెన్సీ పరిదిలోకి వచ్చే గ్రామాలన్ని పంచాయతీలుగా ఏర్పడ్డాయి. వీటితో పాటు మైదాన ప్రాంతంలోని కొన్ని గ్రామాలలో గిరిజనులకు అవకాశాలు రానుండడంతో నియోజక వర్గంలో స్థానిక పోరులో గిరిజనులే ఎక్కువ శాతం పాలకులుగా కొనసాగే అఆశం దక్కింది. స్వయం పాలన కోసం దశాబ్దాల పాటు ఎదురు చూసిన గిరిజనుల కల నెరవేర నుంది. తమను తాము పాలించుకునే అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి రుణ పడి ఉంటాం
ఎన్నో ఏళ్ల తమ కలను సాకారం చేసలంగాణ రాష్ట్ర్ర ప్రభుత్వానికి రుణ పడి ఉంటాం. గతంలో పెద్ద గ్రామ పంచాయతీలకు అనుబందంగా ఉంటూ చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కిలో మీటర్ల దూరం నడిచి పాలకులను కలిసేందుకు తీవ్ర ఇబ్బందులు పడే వాల్లం తాండాలను గ్రామ పంచాయతీలుగా చేయడంతో మా తాండాలను మేమే పాలించుకునే అవకాశం కల్పించారు.
– మల్లేశ్. కొత్త చెరువు తాండ, లింగాల మండలం

చిన్న గ్రామాలతో అభివృద్ధ్ది
చిన్న గ్రామాలతో అభివృద్ది వేగవంత మవుతుందనే లక్షంతో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో మాతాండాలను మేమే పాలించుకునే అవకాశం కల్పించారు. నియోజక వర్గంలో అదికంగా సర్పంచ్‌లుగా గిరిజనులే కానున్నారు. గిరిజనులుగా కేసీఆర్‌కు ఎల్ల వేలల రుణ పడి ఉంటాం.
  – మూడావత్ రాంబాబు నాయక్, రాయల్ గండి తాండా, పదర మండలం

77 new gram panchayats in Achampet constituency

Telangana Latest News