Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

లోయలో పడిన బస్సు.. 8 మంది మృతి

8 Dead after Bus falls down a mountain road in Ambenali Ghat: Maharashtra

ముంబయి: మహారాష్ట్రలోని సతారా జిల్లా అంబేనలి ఘాట్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొలందపూర్ దగ్గర ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అయితే, చికిత్స పొందుతున్న వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments