Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

న్యూయార్క్‌లో ట్రక్కుతో ఉగ్రవాది బీభత్సం

Truck-Attack-in-New-York

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో మ్యాన్‌హట్టన్ డబ్ల్యూటిసి వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ టెర్రరిస్టు ట్రక్కుతో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది వరకు గాయాలపాలయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న భధ్రతాసిబ్బంది క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. డబ్ల్యూటిసి స్మారక చిహ్నం ప్రాంతంలో ఉగ్రవాది ట్రక్కును ఒక్కసారిగా ఫుట్ పాత్ వైపు మళ్లీంచడంతో ఎక్కువ మంది చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రక్కు నడిపిస్తున్న తీవ్రవాదిపై కాల్పులు జరిపారు. దీంతో అతడి పొత్తికడుపులో బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన న్యూయార్క్ రాష్ట్ర మేయర్ ఇది ఉగ్రవాద దాడేనని వెల్లడించారు. సెప్టెంబర్ 2011 తర్వాత న్యూయార్క్ రాష్ట్రంలో ఇదే అతి పెద్ద దాడిగా న్యూయార్క్ పోలీసులు అభివర్ణించారు. కాగా, మృతుల్లో ఐదుగురు అర్జెంటీనా, ఒకరు బెల్జియం వాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగతావారి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments