Home తాజా వార్తలు నిర్బంధ తనిఖీలు.. 8 మంది నైజీరియన్లు అరెస్టు

నిర్బంధ తనిఖీలు.. 8 మంది నైజీరియన్లు అరెస్టు

8 Nigerians Arrested in Police Cardon Search in Rajendranagar

రంగారెడ్డి: జిల్లా రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సన్ సిటీ, పిఅండ్‌టి కాలనీలలో శంషాబాద్ డిసిపి పద్మజా నేతృత్వంలో దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది  సోదాలు చేపట్టారు. వీసా గడువు ముగియడంతో పాటు సరైన పత్రాలు లేని 8 మంది నైజీరియన్లతో సహా 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సరైన ధృవపత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలు, 4 కార్లు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.