Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

తాలిబన్ల దాడిలో 8 మంది పోలీసులు మృతి

8 Policemen Killed in Taliban Attack

కాబూల్ : ఆప్ఘనిస్థాన్‌లోని ఘజినీ ప్రావిన్స్‌లో తాలిబన్లు దాడులకు తెగబడ్డారు. కారబాగ్ జిల్లాలోని పోలీసు సెక్యూరిటీ పోస్టుపై తాలిబన్లు దాడులు చేయడంతో 8మంది పోలీసులు చనిపోయారు. మరో ఏడుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన పోలీసుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ దాడి చేసింది తామేనంటూ తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు. తాలిబన్ల దాడితో భద్రతా బలగాలు అప్రమత్తమై భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహించాయి.

8 Policemen Killed in Taliban Attack

Comments

comments