Search
Friday 21 September 2018
  • :
  • :

ఫ్రాన్స్‌లో భారతీయులు సేఫ్

Nice-truck-attackపారిస్‌: ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో జరిగిన ఘోర ఘటన బాధితుల్లో భారతీయులెవరూ లేరని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ విషాద ఘటన ప్రభావం భారతీయులపై పడినట్లు ఎలాంటి సమాచారం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పష్టం చేశారు. పారిస్‌లోని భారత రాయబారి ఇండియన్ కమ్యూనిటీ వారితో మాట్లాడారని… ఇప్పటి వరకు ఈ ఘటన వల్ల భారతీయులు ప్రమాదానికి గురైనట్లు సమాచారం లేదని తెలిపారు. పారిస్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నెంబరు 33-1-40507070ను స్వరూప్ వెల్లడించారు.

నీస్ నగరంలో బాస్టిల్ డే సంబురాలు చేసుకుంటున్న సమయంలో రోడ్డుపై బాణాసంచా వెలుగులను వీక్షిస్తున్న పాదచారులపైకి భారీ ట్రక్కు దూసుకెళ్లడంతో దాదాపు 80 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ఫ్రాన్స్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఇదిలా ఉండగా మునుపటి ఎమర్జెన్సీని మరో మూడు నెలలు పొడిగించినట్లు సమాచారం. ఈ ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫ్రాన్స్‌కు అండగా ఉంటామని ప్రణబ్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ దాడిని ఖండించారు.

Comments

comments