జకర్తా: ఇండోనేసియాలోని లాంబాక్ దీవుల్లో ఆదివారం రాత్రి భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7 గా నమోదైందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. భారీ భవనాలు కూలిపోవడంతో 82 దుర్మరణం చెందారు. ఈ ఘటనలో పది వేల మందిపైగా గాయపడి ఉంటారని స్థానిక మీడియా వెల్లడించింది. వేలాది ఇండ్లు కూలిపోయాయి. భూ ప్రకంపనలు వచ్చినప్పుడు రోడ్ల మీద వెళ్లే ద్విచక్ర వాహనదారులు కిందపడిపోయారు వారం వ్యవధిలో రెండో సారి లాంబాక్లో భారీ భూకంపం వచ్చింది. ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు ఇండోనేషియా ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. పలు దేశాలను సహాయం చేయాలని ఇండోనేషియా ప్రభుత్వం కోరింది. సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా అంచనా వేసినట్టు సమాచారం.
The dark won’t stop us to help people in #Lombok, after a second #Earthquake struck Lombok earlier this evening. #PMISiapBantu pic.twitter.com/LascNU2FFP
— Indonesian Red Cross (@palangmerah) August 5, 2018
Bersama @Citilink PMI siap membawa 2000 terpal, matras dan selimut dari surabaya menuju #lombok #PMISiapBantu pic.twitter.com/DeyCkAX0iG
— Indonesian Red Cross (@palangmerah) August 6, 2018