Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

భారీ వర్షాలతో 87మంది మృతి

87 People Killed as Heavy Rains Pound in Keralaతిరువనంతపురం : కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 87 మంది చనిపోయారు. పాలక్కడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఏడుగురు చనిపోయారు. 14 జిల్లాల్లో అత్యంత ప్రమాదకరస్థాయి హెచ్చరికలను జారీ చేశారు. కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులోకి నీరు రావడంతో వచ్చే శనివారం వరకు దాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతింది. దీంతో మెట్రో, రైళ్ల సేవలను సైతం రద్దు చేశారు. వరదనీరు వచ్చి చేరుతుండడంతో పెరియార్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ముల్లపెరియార్, చెరుతోని, ఇడుక్కి , ఇదమలయార్‌తో పాటు ఇతర ప్రధాన ప్రాజెక్టుల గెట్లను ఎత్తివేశారు. నీరు దిగువకు వెళుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 1.5లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

87 People Killed as Heavy Rains Pound in Kerala

Comments

comments