Home తాజా వార్తలు 87 ఏళ్ల భార్యను చంపిన 91 ఏళ్ల భర్త

87 ఏళ్ల భార్యను చంపిన 91 ఏళ్ల భర్త

Murder

తిరువనంతపురం : 87 ఏళ్ల భార్యను 91 ఏళ్ల భర్త చంపిన సంఘటన కేరళలోని త్రిశూరు జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ వృద్ధ దంపతులకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. అందరికి పెళ్లిళ్లు కావడంతో వేర్వేరుగా కాపురాలు పెట్టుకోవడంతో వృద్ధ జంట ఒంటరిగా ఉంటుంది. నాలుగు రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ రావడంతో పెనుగులాట జరిగింది. కోపంతో రగిలిపోయిన భర్త…  భార్య తలను గోడకేసి కొట్టాడు. అనంతరం చేతి కర్రతో ఆమె తలపై బాదడంతో ఘటనా స్థలంలో ముసలావిడ చనిపోయింది. భార్య శవాన్ని కిటికలో నుంచి బయటకు పడేసి నిప్పటించాడు.  అయితే తన తల్లి కనిపించడం లేదని  తనయులు ఆగస్టు 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని తమదైన శైలిలో 91 ఏళ్ల వృద్ధుడిని విచారించగా అసలు విషయం బయటపడింది. తన భార్యను తానే హత్య చేసినట్లు భర్త ఒప్పుకోవడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించారు.