Search
Sunday 23 September 2018
  • :
  • :

ప్రభుత్వరంగ బ్యాంకులకు 88,139 కోట్ల మూలధనం

ప్రణాళికను ప్రకటించిన ప్రభుత్వం

Bank

న్యూఢిల్లీ : ముందు నుంచి చెప్పినట్టుగానే ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధన నిధిని ప్రకటించింది. ప్రస్తుత ఆర్థి క సంవత్సరంలో 20 ప్రభుత్వరంగ బ్యాంకులకు(పిఎస్‌బి) రూ.88,139 కోట్ల మూలధన నిధిని అందిస్తున్నట్టు కేంద్ర వెల్లడించింది. దీనిలో రిక్యాపిటైజేషన్ బాండ్ల ద్వారా రూ.80 వేల కోట్లు, బడ్జెటరీ కేటాయింపుల ద్వారా రూ.8,139 కోట్లు అందివ్వనుంది. దీని ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర బిగ్ బూస్ట్ అందించింది. ఈ రీక్యాపిటలైజేషన్‌ను బ్యాంకుల పనితీరు ఆధారంగా చేసుకుని అందించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆరోగ్యకరంగా ఉంచడమే తమ ముఖ్యమై న బాధ్యత అని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. బ్యాంకులకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) పరిమితిని పెంచే ప్రతిపాదనేమీ లేదన్నారు. వచ్చే రెండేళ్లలో మొండిబకాయిలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.2.11 లక్షల కోట్లు ఇవ్వనున్నట్టు జైట్లీ గతేడాదే ప్రకటించిన సంగతి తెలిసిందే. 2017 అక్టోబర్‌లో ప్రకటించిన అతిపెద్ద బ్యాంకు రీక్యాపిటలైజేషన్ ప్రణాళిక వివరాలను బుధవారం వెల్లడించింది. మొండిబకాయిలను సమస్యపై పోరాటమే లక్ష్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆరోగ్యకరంగా ఉంచేందుకు కేంద్రం ఈ ప్రణాళికను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌లో భాగంగా తొలుత రూ. 88,139 కోట్ల మూలధనాన్ని పిఎస్‌బిల్లో జొప్పించనున్నట్టు ప్రభు త్వం ప్రకటించింది. వాటిలో భాగంగా ఎస్‌బిఐకి రూ.8,800 కోట్లు, ఐడిబిఐకి రూ.10,610 కోట్లు, పిఎన్‌బికి రూ.5,740 కో ట్లు, బిఒబికి రూ.5,375 కోట్లు, కెనరా బ్యాంకుకు రూ.4,865 కో ట్లు ఉన్నాయి. ఇంకా యూనియన్ బ్యాంకుకు రూ.4524 కోట్లు, సిండికేట్ బ్యాంకు రూ.2,839 కోట్లు, ఆంధ్రాబ్యాంకుకు రూ.1,890 కోట్లు, విజయ్ బ్యాంకుకు రూ.1,277 కో ట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుకు రూ.785 కోట్లు, బ్యాంకు ఆఫ్ ఇండియాకు రూ.9,232 కోట్లు, యుసిఒకు రూ.6,507 కోట్లు, ఐఒబికి రూ.4,694 కోట్లు, ఒబిసికి రూ.3,571 కోట్లు, దేనా బ్యాంకుకు రూ.3,045 కోట్లు, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రకి రూ.3,173 కోట్లు, యునిటెడ్ బ్యాంకుకు రూ.2,634 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకుకు రూ.2,187 కోట్లు, అలహాబాద్ బ్యాంకుకు రూ.1,500 కోట్లు లభించనున్నాయి. మార్చి నాటికి భారతీయ బ్యాం కుల్లో స్థూల ఎన్‌పిఎ రూ.9.5 లక్షల కోట్లకు పెరగనున్నాయని ఇటీవల అసోచామ్‌క్రిసిల్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం తెలిపింది. 2016 మార్చి నాటికి బ్యాంకుల మొండి బకాయిలు రూ.8 లక్షల కోట్లుగా ఉన్నాయి. అయితే మార్చినాటికి రూ.1.5 లక్షల కోట్లు పెరిగి రూ.9.5 కోట్లకు చేరనుందని నివేదిక వివరించింది. రుణాలు ఎగవేసిన సదరు కంపెనీ యాజమాన్య హక్కులను బదాలయించుకునే అవకాశం బ్యాంకులకు లభిస్తోంది. అయితే రుణాల్లో చాలా వరకు ఎన్‌పిఎ రూపంలో ఉంటే బ్యాంకుల మూలధనంపై ఒత్తిడి పెరుగుతోంది. మార్చి 2018 నాటికి మొత్తం రుణాల్లో 10.5 శాతం ఎన్‌పిఎలు ఉన్నాయి. వీటికి ఎన్‌పిఎలుగా మారడానికి సిద్ధంగా ఉన్న ఆస్తులను కూడా కలిపితే రూ.11.5 లక్షల కోట్లకు చేరతాయని సర్వే తెలిపింది.

Comments

comments