Search
Saturday 17 November 2018
  • :
  • :

మార్నింగ్ వాక్‌కు వెళ్లి.. శవమై వచ్చింది

school-student-image

మన తెలంగాణ/బాలాపూర్ : 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ వెళ్లి సోమవారం ఉదయం శవమైన సంఘటన సోమవారం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్‌గూడ, రాజీవ్‌గృహకల్ప వద్ద చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి… అల్మాస్‌గూడ రాజీవ్‌గృహకల్ప 17వ బ్లాక్‌లో 10 నెంబర్ ఇంటిలో ఏపూరి ప్రభు, అనసూయ నివాసముంటున్నారు. అనసూయ జిహెచ్‌ఎంసిలో పారిశుద్ధ విభాగంలో పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు పెళ్లి చేశారు. ఇక చిన్న కుతూరు వైష్ణవి (14) జిల్లెలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుకుంటుంది. అయితే వైష్ణవి ప్రతి రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మార్నింగ్ వాక్ వెళ్లడానికి సిద్ధమైంది. అదే సమయంలో డ్యూటీకి వెళుతున్న వైష్ణవి అమ్మ అనసూయ చీకటిగా ఉంది కొంచెం ఆలస్యంగా వెళ్లు అంటూ డ్యూటీకి వెళ్లింది. అనంతరం వైష్ణవి వాకింగ్‌వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. తల్లి తండ్రుల ఫిర్యాదు మేరకు మీర్‌పేట్ పోలీసులు ఆదివారం రాత్రి మిస్సింగ్ కేసును నమోదు చేశారు. అయితే సోమవారం ఉదయం రాజీవ్‌గృహకల్ప పక్కనే గల ఓ చర్చి వెనకాల వైష్ణవి మృతదేహం పడిఉంది. దాంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ మన్మోహన్, ఎస్‌ఐ మైబెల్లిలు క్యూస్ టీమ్‌తో వచ్చి పరిశీలించారు. అయితే వైష్ణవి ముఖంపై గాయాలు ఉన్నట్లు తెలుస్తుంది. వైష్ణవిని హత్యాచారం చేసి హత్య చేశారా…? ఏవిధంగా జరిగింది అనేది వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

comments