Home అంతర్జాతీయ వార్తలు పాకిస్తాన్ లో కూలిన గోడ: 9 మంది పిల్లలు మృతి

పాకిస్తాన్ లో కూలిన గోడ: 9 మంది పిల్లలు మృతి

nine-members-children-died

 

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని సుక్కుర్ జిల్లాలో మట్టి గోడ కూలిన ఘటనలో 9 మంది చిన్నారులు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. గులామ్ సర్వార్శంబాని గ్రామంలోని ఓ ఇంటి వద్ద పిల్లలు ఆడుకుంటుండగా మట్టి గోడ కూలి వారిపై పడింది. ఈ ఘటనలో మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను  చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు 14 ఏండ్ల లోపు వారేనని పేర్కొన్నారు. చనిపోయిన వారిలో ఏడుగురు బాలికలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.  భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని  పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. శవ పరీక్ష చిన్నారుల మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

9 Children dead after wall of house collapsed in Pak

Telangana news