Home అంతర్జాతీయ వార్తలు టర్కీలో కారు బాంబు పేలుడు : 9 మంది సైనికులు మృతి

టర్కీలో కారు బాంబు పేలుడు : 9 మంది సైనికులు మృతి

CARBOMBఇస్తాంబుల్ : సైనికులే లక్ష్యంగా తీవ్రవాదులు జరిపిన కారు బాంబు పేలుళ్లలో 9 మంది జవాన్లు మృతి చెందారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. టర్కీకి ఆగ్నేయ సరిహద్దులో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఈ పేలుడు సంభవించింది. సెమ్‌డిన్లి నగరానికి సమీపంలోని డ్యూరాక్ జండ్మండరీ స్టేషన్‌లో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.