Home తాజా వార్తలు నకిరేకల్ లో బాలుడి హత్య!

నకిరేకల్ లో బాలుడి హత్య!

Murder

నల్గొండ: నకిరేకల్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు బాలుడిని హత్యచేసి ఇంటిపైకప్పుపై పడేశారు. సోమవారం సాయంత్రం అదృశ్యమైన 9 ఏళ్ల సాత్విక్ అనే బాలుడు ఇవాళ ఉదయం శవంగా తేలాడు. సాత్విక్ మృతదేహాన్ని ఇంటిపైన కుటుంబ సభ్యులు గుర్తించారు. నిన్న సాయంత్రం సాత్విక్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని అతని తల్లిదండ్రులు తెలిపారు. సాత్విక్ గుర్తుతెలియని దుండగులు హత్యచేసి ఇంటిపైనే పడేసినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగ విషాదం నెలకొంది. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

9 Year Old Boy Brutally Murdered in Nakrekal

Telangana Breaking News